News March 4, 2026
వరంగల్: డ్రంకెన్ డ్రైవ్‌లో 105 మందిపై కేసులు

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో 105 మంది పట్టుబడ్డారు. ఇందులో అత్యధికంగా ట్రాఫిక్ విభాగంలోనే 57 కేసులు నమోదయ్యాయి. సెంట్రల్ జోన్‌లో 16, వెస్ట్ జోన్‌లో 30, ఈస్ట్ జోన్‌లో 2 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News April 6, 2026
లేఆఫ్స్ వద్దు.. రీస్కిల్లింగ్‌పై దృష్టి పెట్టండి: NITES

టెక్ కంపెనీలు లేఆఫ్స్‌కు బదులు ఉద్యోగుల స్కిల్స్‌ను పెంచడంపై దృష్టి పెట్టాలని IT ఉద్యోగుల సంఘం ‘నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్’ అభిప్రాయపడింది. లేఆఫ్స్‌ను చివరి ఆప్షన్‌గా చూడాలంది. ప్రైవేట్ సెక్టార్‌లో లే ఆఫ్స్, నోటీస్ పీరియడ్స్, పరిహారాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు లేవని, ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఉద్యోగుల హక్కులను కాపాడాలని సంఘం ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా కోరారు.
News April 6, 2026
ఒక్కరోజే 51 లక్షల సిలిండర్ల విక్రయం: కేంద్రం

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మార్చి 23 నుంచి ఇప్పటివరకు 5 కేజీల సిలిండర్లు 6.6 లక్షలు అమ్ముడైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎలాంటి కొరత లేదని, ఏప్రిల్ 4న ఒక్క రోజే 51 లక్షల గృహ వినియోగ సిలిండర్లు డెలివరీ అయ్యాయని తెలిపింది. మార్చి నుంచి ఇప్పటివరకు అక్రమంగా నిల్వ చేసిన 50వేలకు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
News April 6, 2026
HYD: సర్వ రోగాలకు మందు ఇక్కడే!

ప్రజలకు వ్యాధులు వస్తే అత్యాధునిక ఆస్పత్రుల్లో వైద్యం అందించేకంటే అవి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జిమ్ ఫీజు భరించలేక వీటికి దూరమవుతున్నారు. రోజూ 45 MIN వ్యాయామంతో షుగర్, BP రావని నిపుణల మాట. GHMCలోని వార్డుల్లో, శివారు గ్రామాల్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి, పాడైనవి రిపేర్ చేయాలి. దీనికోసం కబ్జా అయిన పార్క్ స్థలాలను విడిపించి పార్క్‌గా, ఓపెన్ జిమ్‌గా మార్చితే సరి. మీరేమంటారు?


