News March 4, 2026
సంగారెడ్డి: ‘ఇంటర్నల్ మార్కులను నమోదు చేయాలి’

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల యొక్క ఇంటర్నల్ మార్కులను రేపటిలోగా ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విషయాన్ని అన్ని రకాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు. నమోదు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News March 10, 2026
కర్నూలు నగరపాలక సంస్థకు స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ సిరి

కర్నూలు నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా కలెక్టర్ ఏ.సిరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు కమిషనర్ విశ్వనాథ్‌ను నందికొట్కూరుకు, కర్నూలు ఆర్డీవోను గూడూరుకు స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. ఆదోనికి జాయింట్ కలెక్టర్, ఎమ్మిగనూరుకు స్థానిక ఆర్డీవోను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
News March 10, 2026
కాకి ఇంటి ముందుకు వస్తే శుభమా? అశుభమా?

జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుని వాహనం కాకి. దాన్ని ‘కాలజ్ఞాని’గా భావిస్తారు. ఇంటి ముందు కాకి అరిస్తే అతిథులు వస్తారని నమ్మకం. అయితే అది వింత స్వరంతో అరిచినా, గుంపు వచ్చి వాలినా ఆపదలకు సంకేతమని జ్యోతిషులు చెబుతున్నారు. ఇక కాకి ఇంటి లోపలికి రావడం అయితే తీవ్ర అశుభమని అంటున్నారు. ఇది ఏదైనా చెడు వార్తను లేదా పెద్ద విపత్తును సూచిస్తుందట. అయితే ఇవన్నీ విశ్వాసాలే తప్ప శాస్త్రీయ ఆధారం లేదని గమనించాలి.
News March 10, 2026
యుద్ధ ప్రభావంతో ఆగిన అరటి ఎగుమతులు

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం అనంతపురం జిల్లా అరటి రైతులపై తీవ్రంగా పడింది. ఇరాన్, గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో టన్ను ధర రూ.22 వేల నుంచి రూ.9 వేలకు పడిపోయింది. వ్యాపారస్తులు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో తోటల్లోనే పంట పండిపోతోంది. పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొనడంతో రైతులు దిగులు చెందుతున్నారు. గిట్టుబాటు ధర లేక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.


