News March 4, 2026
TDP Vs YCP.. మండలిలో రసాభాస

AP: తిరుమల లడ్డూపై చర్చ శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. సంబంధం లేని అంశాలు చర్చకు తెచ్చి డైవర్ట్ చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై తమ MLC చంద్రశేఖర్ రెడ్డి ప్రసంగాన్ని TDP అడ్డుకుందంటూ YCP ఆందోళనకు దిగింది. అధికార పక్షం తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తామంది. దీంతో వాకౌట్ చేసి వెళ్లిపోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.
Similar News
News March 9, 2026
మిడిల్ ఈస్ట్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం: జైశంకర్

మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై MEA జైశంకర్ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. అక్కడి పరిణామాలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నా నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మన ఇంధన అవసరాల విషయంలో మిడిల్ ఈస్ట్ కీలకమన్నారు. క్రూడాయిల్ ధర పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. భారతీయుల భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. టెహ్రాన్‌లోని భారతీయ ఎంబసీ కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు.
News March 9, 2026
క్రూడ్ ఆయిల్ నుంచి లభించే ఉత్పత్తులివే!

క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్‌తో పాటు మానవాళి అవసరాలను తీర్చే మరెన్నో ఉత్పత్తులు తయారవుతాయి. క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, మెరైన్ ఫ్యూయల్ లభిస్తాయి. అలాగే ప్లాస్టిక్స్, సింథటిక్ ఫైబర్స్ & రబ్బర్లు, డిటర్జెంట్స్(సబ్బులు), పెయింట్స్ తయారీలోనూ ఉపయోగిస్తారు. ఇంటి అవసరాల కోసం LPG, కొవ్వొత్తులు, వాసెలిన్, లిప్‌స్టిక్ తయారీలోనూ ఇది కీలకం. ముడి చమురు వేస్ట్‌తో తారు రోడ్లు వేస్తారు.
News March 9, 2026
మే 17న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష

IIT రూర్కీ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల తేదీని ప్రకటించింది. మే 17న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఏప్రిల్‌లో ఓపెన్ అవుతాయి. ఏప్రిల్ 6 నుంచి విదేశీ విద్యార్థులకు, ఏప్రిల్ 23 నుంచి భారతీయ విద్యార్థులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. మే 2 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ. హాల్ టికెట్లు మే 11 నుంచి అందుబాటులో ఉంటాయి. <


