News May 4, 2024

పైకొకటి.. లోపల ఇంకోటి..

image

రాజకీయ పార్టీలు ఏ పక్షపాతం లేకుండా అన్ని వర్గాల వారికి అవకాశం కల్పిస్తున్నామని చెబుతుంటాయి. అయితే.. అదంతా పైకి మాత్రమేననే భావన చాలామందిలో ఉంటోంది. ఫలానా పార్టీ అని కాకుండా దాదాపు అన్ని పార్టీలు కులమతాలు, డబ్బు, పలుకుబడి ప్రాతిపదికనే టికెట్లు కేటాయిస్తున్నాయనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ విషయం ఆయా పార్టీల కార్యకర్తలకు సైతం తెలిసినా ఒప్పుకోరు. మీ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితే ఉందా? కామెంట్ చేయండి.

Similar News

News December 31, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 31, 2024

TODAY HEADLINES

image

☛ సత్య నాదెళ్లతో CM రేవంత్ భేటీ.. పెట్టుబడులపై చర్చ
☛ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని TG అసెంబ్లీ తీర్మానం
☛ 2025లో BRS చీఫ్ ఎన్నిక: KTR
☛ ₹80,112crతో తెలుగు తల్లికి జలహారతి ప్రాజెక్టు: CM CBN
☛ APలో FEB 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు
☛ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను ఒంటరి చేశారు: పవన్
☛ ఎయిడ్స్ టీకాకు USFDA ఆమోదం
☛ PSLV-C60 ప్రయోగం సక్సెస్
☛ BGT నాలుగో టెస్టులో INDపై AUS గెలుపు

News December 31, 2024

కండోమ్స్, ORSలతో న్యూఇయర్ పార్టీ ఇన్విటేషన్

image

మహారాష్ట్ర పుణేలో ఓ పబ్ నిర్వాహకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు యువతకు ఇన్విటేషన్ లెటర్‌తోపాటు కండోమ్‌లు, ORS ప్యాకెట్లను పంపారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవడంతో నెటిజన్లు ఫైరవుతున్నారు. మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇన్విటేషన్ పొందిన వ్యక్తుల వాంగ్మూలాలను రికార్డు చేశామని వారు చెప్పారు.