News March 4, 2026

సంగారెడ్డి జైలు సూపరిండెంట్‌గా సంతోష్ కుమార్ బాధ్యతలు

image

సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగార సూపరిండెంట్‌గా సంతోష్ కుమార్ రాయ్ బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది ఇదే జైలులో పనిచేసిన ఆయన జూన్‌లో హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ అయ్యారు. తాజాగా ప్రభుత్వం తిరిగి ఆయన్ని సంగారెడ్డికే నియమించడంతో బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జైలు అధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News April 18, 2026

కాళ్ల బేరానికొచ్చిన ట్రంప్?

image

ఇరాన్‌ను నాశనం చేసి హార్ముజ్‌ను స్వాధీనం చేసుకుంటామని ఇన్నాళ్లూ పెద్దపెద్ద ప్రకటనలు చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశంపై ప్రేమను ఒలకబోస్తున్నారు. హార్ముజ్‌ను ఓపెన్ చేశామని ప్రకటించడంతో ఏకంగా థాంక్స్ చెప్పారు. ఇరాన్ అందమైన దేశమంటూ కీర్తించారు. యుద్ధంలో గెలవడం చేతగాకే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నారని పలువురు నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఇరాన్ యురేనియం ఇచ్చేస్తుందన్న ట్రంప్ <<19679151>>ప్రకటనా<<>> ఉత్తదే అని తేలింది.

News April 18, 2026

శ్రీ సత్యసాయి: కుక్క రూపంలో మృత్యువు!

image

లేపాక్షి KGBV ఆంగ్ల టీచర్ సుబాన్ బీ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. భర్తతో బైకుపై వెళ్తుండగా చోళసముద్రం టోల్‌గేట్ వద్ద కుక్క అడ్డురావడంతో కిందపడ్డారు. తీవ్ర గాయాలైన ఆమెను చికిత్స కోసం హిందూపురం, అక్కడి నుంచి అనంతపురం తరలిస్తుండగా మరణించారు. సమయానికి ముఖహాజరు వేయాలనే ఆత్రుతతో వెళ్తున్న ఆమెను కుక్క రూపంలో వచ్చిన మృత్యువు బలితీసుకుంది. కుటుంబీకులు, విద్యార్థులు శోకసంద్రంలో మునిగారు.

News April 18, 2026

HYDలో పెరిగిన టమాటా ధరలు

image

రెండు నెలలుగా భారీగా పడిపోయిన టమాటా ధరలు మళ్లీ పెరిగాయి. 2 వారాల క్రితం రూ.10కే 2 కిలోలు అమ్మారు. గతవారం రూ.10కి కిలో విక్రయించారు. నిన్న రాత్రి నగర శివారులో వారాంతపు మార్కెట్లో కేజీ రూ.20- 25 వరకు అమ్మారు. ఉప్పల్ పెద్ద మార్కెట్లోనూ దాదాపు ఇదే రేట్‌కు అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక దుకాణాల్లో రూ.30 వరకు కొంటున్నట్లు ప్రజలు చెబుతున్నారు. మీ ఏరియాలోనూ టమాటా రేట్లు పెరిగాయా? కామెంట్ చేయండి.