News May 4, 2024
డీజీపీ, సీఎస్‌ను వెంటనే బదిలీ చేయాలి: కనకమేడల
AP DGP, CSలను వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని TDP నేత కనకమేడల రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. ‘వీరిద్దరినీ బదిలీ చేసి APలో శాంతిభద్రతలు కాపాడాలి. ఇతర రాష్ట్రాల నుంచి అబ్జర్వర్లను పంపాలి. రాష్ట్రంలో కేవలం 14 నియోజకవర్గాలను మాత్రమే సమస్యాత్మక ప్రాంతాలుగా ఈసీ గుర్తించింది. ఈ లిస్టులో పులివెందుల పేరు లేదు. సమస్యాత్మక ప్రాంతాలు, నియోజకవర్గాలను గుర్తించి స్పెషల్ ఫోర్స్ ఇవ్వాలి’ అని కోరారు.
Similar News
News December 31, 2024
2015 తర్వాత తొలిసారిగా ఢిల్లీలో ‘స్వచ్ఛ’ డిసెంబర్!
2015 తర్వాత వచ్చిన డిసెంబర్లలో ఢిల్లీలో అత్యంత తక్కువ కాలుష్యం ఈ ఏడాది డిసెంబరులోనే నమోదైందని ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఈ నెల ప్రథమార్ధంలో బలమైన గాలులు, ద్వితీయార్థంలో రికార్డు స్థాయి వర్షాలు దీని వెనుక కారణాలని వివరించారు. ఇప్పటికీ ఏక్యూఐ ప్రమాదకర స్థాయిలోనే.. అంటే 295 పాయింట్ల వద్ద ఉంది. గుడ్డికంటే మెల్ల మిన్న అన్నట్లుగా ఈ 9ఏళ్లలో ఇది కొంచెం బెటర్ అయిందనేది అధికారుల ప్రకటనలో సారాంశం.
News December 31, 2024
2024 చివరికి ప్రపంచ జనాభా ఎంతంటే?
ప్రపంచ జనాభా 2024లో 7.1కోట్లు పెరిగి 800.09కోట్లకు చేరుకున్నట్లు US సెన్సస్ బ్యూరో అంచనా వేసింది. 0.9% పెరుగుదల నమోదైందని తెలిపింది. అయితే 2023తో(7.5 కోట్లు) పోలిస్తే స్వల్ప తగ్గుదల ఉందని పేర్కొంది. 2025లో ప్రతి సెకనుకు 4.2జననాలు, 2మరణాలు నమోదయ్యే అవకాశం ఉందంది. ఇక US జనాభా 26లక్షలు పెరిగి 34.1కోట్లకు చేరిందని వెల్లడించింది. వచ్చే ఏడాది 9సెకన్లకో జననం, 9.4సెకన్లకో మరణం నమోదవ్వచ్చని తెలిపింది.
News December 31, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.