News March 4, 2026
‘మంచిర్యాల జిల్లాలో హెల్త్ మిషన్‌పై సమీక్ష’

జిల్లాలో ప్రజాపాలన-పట్టణ ప్రణాళిక, 100రోజుల హెల్త్ మిషన్ కార్యక్రమాన్ని వైద్య అధికారులు విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.ఎస్.అనిత అన్నారు. మార్చి 6నుంచి జూన్ 12వరకు 99 రోజులపాటు ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో చేయవలసిన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సహకారంతో చేయవలసిన విధులు, పరిసరాల పరిశుభ్రత, వ్యాధులు ప్రబలకుండా చేపట్టవలసిన చర్యలను వివరించారు.
Similar News
News March 28, 2026
కర్నూలు జిల్లాలో 52 వాహనాలు స్వాధీనం

మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ కింద జిల్లావ్యాప్తంగా శనివారం మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలో 196 మంది పోలీసులతో చేపట్టిన తనిఖీల్లో 350 మందిని, 50 ఇళ్లను పరిశీలించారన్నారు. 77 వాహనాలు తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని 52 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మంత్రాలయం పరిధిలో 41 లిక్కర్ బాటిళ్లు సీజ్ చేశారన్నారు.
News March 28, 2026
వేములవాడ: ఏప్రిల్ 7న రాజన్న కోడెల పంపిణీ

తిప్పాపూర్‌లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన గోశాలకు చెందిన కోడెలను వచ్చే నెల (ఏప్రిల్) 7వ తేదీన పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. గోశాలలోని మధ్యస్థం నుంచి పెద్ద పరిమాణంలో ఉన్న సుమారు 300 కోడెలను మంగళవారం ఉదయం 7 గంటలకు రైతులకు, భక్తులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కోడెలను పొందగోరే వారు నిర్ణీత సమయానికి గోశాల వద్దకు చేరుకోవాలని సూచించారు.
News March 28, 2026
రంప: ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

పోలవరం జిల్లా కేంద్రమైన రంపచోడవరంలో వివిధ శాఖల కార్యాలయాలు ఏర్పాట్లను కలెక్టర్ దినేష్ కుమార్ శనివారం పరిశీలించారు . PMRC, యూత్ ట్రైనింగ్ సెంటర్లలో పోలీస్, జిల్లా మేజిస్ట్రేట్ తదితర కార్యాలయాలు ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. జేసీ స్మరణ్ రాజ్ ఆయన వెంట ఉన్నారు. కాగా కొత్త జిల్లా ఏర్పాటు జరిగిందే తప్ప ఇప్పటి వరకు చాలా శాఖలకు కార్యాలయాలు ప్రారంభం కాలేదు.


