News March 4, 2026
స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శని నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో మార్చి 5న ప్రతి గ్రామంలో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కలెక్టర్ కృతిక శుక్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం సమీక్ష జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. ప్రతి గ్రామ సభలో కనీసం 200 మంది పాల్గొనేలా చూడాలన్నారు.
Similar News
News March 10, 2026
నేపాల్‌లో RSP ఘన విజయం.. మోదీ కంగ్రాట్స్

నేపాల్ సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. 165 స్థానాలకు గాను రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 125 చోట్ల గెలిచింది. నేపాలీ కాంగ్రెస్ 18, CPN(UML) 9, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ 7, మిగతా పార్టీలు 5 స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఓ చోట రిజల్ట్ పెండింగ్‌లో ఉంది. ఘన విజయం సాధించిన RSP ప్రెసిడెంట్ రవి లామిచానే, ప్రధాని అభ్యర్థి బాలెన్ షాతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.
News March 10, 2026
అగనంపూడి హైవేపై యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

అగనంపూడి టోల్గేట్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. అగనంపూడి ప్రాంతానికి చెందిన యువకుడు బలిరెడ్డి కిషోర్ ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డు పక్కన మైలురాయిను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దువ్వాడ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.
News March 10, 2026
HYD: PF సమస్యలు ఉన్నాయా? ఇక్కడికి రండి

EPFOకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు బాలానగర్ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో ఉన్న EPFO కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు. PF విత్‌డ్రా, నామినీ యాడ్ చేయడం, KYC అప్‌డేట్, అకౌంట్ సంబంధిత ఇతర సమస్యలను అక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.


