News March 4, 2026

ప.గో: ఇన్‌ఛార్జ్‌ల ఏలుబడిలో గృహనిర్మాణ శాఖ

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో గృహనిర్మాణ శాఖ రెగ్యులర్ అధికారులు లేక కునారిల్లుతోంది. ఉమ్మడి జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు డైరెక్టర్ పోస్టులు 2022 నుంచి ఇన్‌ఛార్జ్‌ల ఏలుబడిలోనే ఉన్నాయి. రెండు జిల్లాలో సుమారు లక్షకు పైగా ఇళ్లు నిర్మాణ దశలో ఉన్న తరుణంలో, పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో పనుల పర్యవేక్షణ కుంటుపడుతోంది. తక్షణమే పూర్తి స్థాయిలో అధికారులను నియమించి, పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Similar News

News April 19, 2026

నగరడోన@45.4 డిగ్రీలు.. రేపు 32 మండలాల్లో తీవ్ర వడగాలులు

image

ఇవాళ APలో ఎండలు బెంబేలెత్తించాయి. కర్నూలు(D) నగరడోనలో 45.4, కడప(D) ఖాజీపేటలో 44.5 డిగ్రీలు, చాలా చోట్ల 40 డిగ్రీల పై ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. రేపు 32 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. అలాగే కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.

News April 19, 2026

అన్న క్యాంటిన్లకు భువనేశ్వరి రూ.76 లక్షల విరాళం

image

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం (ఏప్రిల్ 20) పురస్కరించుకుని ఆయన సతీమణి భువనేశ్వరి ఉదారత చాటుకున్నారు. అన్న క్యాంటిన్లకు రూ.76 లక్షల విరాళం ప్రకటించారు. ఈ నిధులతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటిన్లలో పేదలకు ఉచితంగా భోజనం వడ్డించనున్నారు. పేదల ఆకలి తీర్చడంలో ఈ క్యాంటిన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటికి అండగా నిలవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

News April 19, 2026

ఇల్లందు: మృత్యుంజయుడు.. పసిబిడ్డకు పునర్జన్మ!

image

ఇల్లందు ఏరియా ఆసుపత్రి వైద్యులు అద్భుతం చేశారు. శ్వాస, గుండె స్పందన నిలిచిపోయి క్లిష్ట స్థితిలో వచ్చిన మూడు నెలల బాలుడికి ప్రాణం పోశారు. డాక్టర్‌ అజ్మీరా భగత్ సింగ్ బృందం అప్రమత్తమై మూడు విడతలుగా సీపీఆర్‌ నిర్వహించి, అడ్రినలిన్‌ డోసులు అందించారు. వైద్యుల అలుపెరుగని పోరాటంతో పసివాడి గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. అనంతరం చిన్నారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.