News March 4, 2026
SRPT: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ నరసింహ

మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన ఘోర <<19298055>>కారు ప్రమాద స్థలాన్ని<<>> ఎస్పీ నరసింహ బుధవారం సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు యువకులు మృతి చెందడంపై సంతాపం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రయాణాల్లో వాహనదారులు నిబంధనలు పాటించి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.
Similar News
News March 10, 2026
వేసవి కార్యాచరణకు సిద్ధం: GNT కలెక్టర్

రానున్న వేసవి దృష్ట్యా ముందస్తు చర్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుంటూరు జిల్లాలో వేసవి కార్యాచరణకు తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఈ సందర్భంగా తెలిపారు. తాగునీటి సరఫరా, వైద్యం, అగ్నిమాపక సేవలపై రెవెన్యూ, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు వివరించారు.
News March 10, 2026
విజయవాడలో ఏసీబీ అధికారుల తనిఖీలు

విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ (VMC)లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు తనిఖీలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్‌లో రికార్డులు తనిఖీలు చేస్తున్నారు. ఇంటి పన్ను మార్పులు, కాంట్రాక్టు బిల్లులు, రికార్డుల పరిశీలనలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదుల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలపై వివరాలు తెలియాల్సి ఉంది.
News March 10, 2026
చమురు సంక్షోభం.. చైనా ఎందుకు భయపడట్లేదు?

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండుతున్నా ఇరాన్ నుంచి 90% ఆయిల్‌ను కొనే చైనా మాత్రం పెద్దగా ఆందోళన చెందట్లేదు. దీనికి కారణం ఆ దేశం నిల్వ చేసుకున్న 1.4 బిలియన్ బ్యారెళ్ల అత్యవసర నిల్వలే. అలాగే చైనాలో పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వల్ల చమురుపై ఆధారపడటం తగ్గింది. ఒకవేళ గల్ఫ్ దేశాల్లో సరఫరా నిలిచినా రష్యా నుంచి దిగుమతులు పెంచుకునే వెసులుబాటు ఉండటంతో చైనా ఈ చమురు సంక్షోభాన్ని తట్టుకోగల ధీమాతో ఉంది.


