News March 5, 2026
జగిత్యాల: సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన ప్రచార రథం ప్రారంభం

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథక ప్రచార రథాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం ప్రారంభించారు. అనంతరం పథకానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లా రెడ్ కో అధికారి మనోహర్, ఆర్డీవో మధుసూదన్, జడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి, డిపిఆర్ఓ నరేశ్, డిపిఓ మదన్మోహన్, డివైఎస్ఓ రవి కుమార్ పాల్గొన్నారు.
Similar News
News March 10, 2026
నంద్యాల: ఏపీ మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలు

నంద్యాల జిల్లాలోని 20 ఏపీ మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఒక్కో పాఠశాలలో 100 సీట్ల చొప్పున జిల్లా వ్యాప్తంగా 2,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 31వ తేదీలోపు apms.apcfss.inలో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 12న నిర్వహించే ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరుగుతుందని అధికారులు వెల్లడించారు.
News March 10, 2026
అనంత: ఉద్యోగుల సీనియారిటీ లిస్టులో తప్పులు..!

స్వర్ణ వార్డ్ సచివాలయ ఉద్యోగుల సీనియారిటీ లిస్ట్‌లో తప్పులు ఉన్నట్లు రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాయలసీమ అధ్యక్షుడు ఆదినారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో PGRS కార్యక్రమంలో సచివాలయం ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులకు వారు వినతి ఇచ్చారు. సీనియార్టీ లిస్టును సరిదిద్ది రిజర్వేషన్ ఎంప్లాయీస్‌కి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు.
News March 10, 2026
విశాఖలో నేడు అంతర్జాతీయ నీటి భద్రతా సదస్సు

విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ (VER) నీటి భద్రత ప్రణాళికపై మంగళవారం నోవాటెల్ హోటల్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ముఖ్యమంత్రి, పురపాలక శాఖ మంత్రి మార్గదర్శకత్వంలో సింగపూర్, ఆస్ట్రేలియా సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. పెరుగుతున్న నీటి అవసరాలు, వనరుల సమర్థ వినియోగం, అంతర్జాతీయ నిర్వహణ పద్ధతులపై నిపుణులు చర్చించనున్నారని అధికారులు పేర్కొన్నారు.


