News March 5, 2026

భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలోని 16 గ్రామాల్లో 1983 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని కలెక్టర్ వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జయలక్ష్మికి తెలిపారు. ఏపీ సచివాలయం నుంచి బుధవారం జిల్లా కలెక్టర్లతో సీసీఎల్ఏ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 22 ఏ భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ వివరించారు.

Similar News

News April 17, 2026

జీవీఎంసీ ఓపెన్ ఫారంకు 43 వినతులు

image

జీవీఎంసీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ నిర్వహిస్తున్న ఓపెన్ ఫోరం కార్యక్రమానికి 43 ఫిర్యాదులు వచ్చాయని సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు తెలిపారు. మధురవాడ జోన్‌-06, ఈస్ట్ జోన్-09, సౌత్ జోన్-02, నార్త్ జోన్-08, వెస్ట్ జోన్-05, పెందుర్తి జోన్-11, గాజువాక జోన్‌కు ఒకటి, ప్రధాన కార్యాలయానికి ఒకటి చొప్పున వినతలు అందాయని చెప్పారు. వీటిని సంబంధిత జోనల్ కార్యాలయంలో పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

News April 17, 2026

రామచంద్రపురంలో రేపు జాబ్ మేళా

image

రామచంద్రపురం ఉపాధి భవన్‌లో ఏప్రిల్ 18(శనివారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్మికశాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కియా అనుబంధ సంస్థలో ఉద్యోగాలకు బీటెక్ చదివి 30 ఏళ్ల లోపు పురుష అభ్యర్థులు, గోదావరి సోలార్ కంపెనీలో టెలి కాలర్ ఉద్యోగాలకు 18 -30 ఏళ్ల మహిళా అభ్యర్థులు హాజరు కావొచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

News April 17, 2026

NGKL: ఈనెల 18 నుంచి మండల స్థాయి జనగణన శిక్షణ కార్యక్రమం

image

ఈనెల 18 నుంచి మే 5 వరకు మొదటి విడత మండల స్థాయి జనగణన శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన ఎన్యుమారేటర్లు, సూపర్వైజర్స్‌కు ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రత్యేక మార్గదర్శకం అందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 9 మండలాలు, 4 మున్సిపాలిటీల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.