News May 4, 2024
విశాఖ చేరుకున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

ఒక్క రోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా శనివారం విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, రెవెన్యూ, పోలీసు అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఆంధ్రా యూనివర్శిటీలోని స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద జరిగే ఈవీఎంల కమిషనింగ్, ఇతర ప్రక్రియలను పరిశీలించే నిమిత్తం ఆయన వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Similar News
News March 11, 2026
విశాఖ జిల్లాలో రికార్డ్ లెవల్లో రిఫండ్.. ఎన్ని కోట్లంటే?

సైబర్ నేరాల బాధితులకు రిఫండ్ అందించడంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షణలో 1,240 మంది బాధితులకు రూ. 22.47 కోట్లు రిఫండ్ చేయగా, 558 మంది నిందితులను అరెస్ట్ చేశారు. లోన్ యాప్ కేసుల్లో రూ. 60 లక్షల క్రిప్టో స్వాధీనం చేసుకున్నారు. మోసపోతే తక్షణమే 1930కి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
News March 11, 2026
వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు

వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి 24 రోజుల ముందే 78.464 మిలియన్ టన్నుల లోడింగ్ లక్ష్యాన్ని అధిగమించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 16.5 శాతం వృద్ధి. ఈ చారిత్రాత్మక విజయం అని.. టీమ్ వాల్తేరును డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా అభినందించారు. కస్టమర్ కేంద్రీకృత విధానాలు, సమన్వయంతోనే ఈ అసాధారణ మైలురాయి సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
News March 11, 2026
మధురవాడ జోన్‌లో అక్రమ నిర్మాణాలపై ఏసీబీ అధికారుల ఆరా

మధురవాడ జోన్ ప్రణాళిక విభాగంలో ఏసీబీ అధికారుల తనిఖీలు బుధవారం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిన్నటి దాడుల్లో స్వాధీనం చేసుకున్న దస్త్రాల ఆధారంగా క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనలు, ఆమోదించిన ప్లాన్‌లకు భిన్నంగా ఉన్న నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


