News May 4, 2024

బూతులు తిట్టేవాళ్లను మోకాళ్లపై కూర్చోబెడతాం: పవన్

image

AP: బూతులు తిట్టే ప్రభుత్వాన్ని కాకుండా గోతులు పూడ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. ‘నాకేం కొడాలి నానిని తిట్టాలని లేదు. కానీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే నా సొంత రక్తానికైనా ఎదురు తిరుగుతా. బూతులు తిట్టేవాళ్లను మోకాళ్లపై కూర్చోబెట్టే ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. అవినీతి కోటలను బద్దలుకొడతాం. వీళ్ల బూతులకు గోరీలు కడతాం. వచ్చేది కూటమి ప్రభుత్వమే’ అని గుడివాడలో స్పష్టం చేశారు.

Similar News

News March 13, 2026

గ్యాస్ బుక్ చేసే వారికి ఎస్పీ సూచనలు

image

గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు SP వకుల్ జిందాల్ సూచించారు. వంటగ్యాస్ సిలెండర్ల కొరత ఉందనే అపోహలను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మల్చుకొని ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. అదనపు సిలెండర్లు కేటాయిస్తామని బురిడీ కొట్టిస్తున్నారని వివరించారు. అనుమానస్పద లింకులు ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చెయ్యొద్దని సూచించారు.

News March 13, 2026

ఒంటిపూట బడులు.. ఉ.7.45 గంటలకే స్కూల్

image

AP: ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం మార్చి 16 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలు పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు జీవో జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం రాగిజావ, మధ్యాహ్న భోజనం యథావిధిగా అందుతుందని పేర్కొన్నారు.

News March 13, 2026

విద్యార్థులూ.. ట్రిపుల్ ఐటీ ఎదురుచూస్తోంది!

image

TG: 2026-27కు సంబంధించి బాసర, మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను ఆర్జీయూకేటీ వీసీ గోవర్ధన్ విడుదల చేశారు. టెన్త్ మార్కుల ఆధారంగా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో సీట్లు కేటాయించనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు <>వెబ్‌సైట్‌<<>> ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 16న నోటిఫికేషన్ రానుంది. 18వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.