News May 4, 2024

తూ.గో.: గుండెపోటుతో ASI మృతి

image

తూ.గో. జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు ASI పీవీ నాగేశ్వరరావు గుండెపోటుతో శనివారం మృతిచెందారని చింతూరు ఎస్సై శ్రీనివారావు తెలిపారు. ఆయన ఏడుగురాళ్లపల్లి అవుట్ పోస్ట్‌లో డ్యూటీ చేస్తుండగా కుప్ప కూలిపోవడంతో రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామని అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని తెలిపారు. దీంతో చింతూరులో విషాదం నెలకొంది.

Similar News

News February 28, 2026

కల్తీ పాలు బాధితులకు మంత్రి నిమ్మల భరోసా

image

రాజమండ్రి కలెక్టరేట్‌లో శనివారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం తరఫున బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రోగుల కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించి, అత్యుత్తమ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

News February 28, 2026

సబ్ రిజిస్ట్రార్ నివాసాల్లో ఏసీబీ సోదాలు

image

రాజమండ్రి, కడియం పరిధిలో ఏసీబీ అధికారులు శనివారం మెరుపు దాడులు చేశారు. సబ్ రిజిస్ట్రార్ లక్ష్మీ, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, సబ్ ఆర్డినేట్ వీరబాబు నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కాకినాడ, రాజమండ్రిలోని వీరి ఇళ్లలో ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

News February 28, 2026

తూ.గో: పొట్టకూటి కోసం వెళ్తూ.. మృత్యవాత

image

తూ.గో. జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై లారీ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా గజపతినగరం(M) పాతబగ్గానికి చెందిన కొందరు సభ్యులు కృష్ణాజిల్లా గుడివాడ మినప చేలు తీత కోసం బయలుదేరి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిద్ర మత్తులో ఉండగా లారీ వెనక డోర్ పైనుంచి జారిపడి తలకు దెబ్బ తగిలి సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.