News March 5, 2026

GNT: నెయ్యి కల్తీ జరిగిందని క్లియర్‌గా ఉంది.. TDP ఎమ్మెల్యే

image

సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సిట్ నివేదికలో 2019 నుంచి 2024వరకు 60లక్షల మెట్రిక్ టన్నుల నెయ్యిలో కల్తీ జరిగిందని, రూ.240 కోట్ల కుంభకోణం జరిగినట్టు స్పష్టంగా ఉందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుధవారం ధూళిపాళ్ల వైసీపీపై విమర్శలు చేశారు. ఎన్డీడీబీ ప్రాథమిక నివేదికలోనే వెజిటబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు ప్రస్తావన ఉందని, అదే విషయాన్ని సిట్ తేల్చిందన్నారు.

Similar News

News March 8, 2026

నిర్మల్: ఆ కుటుంబంలో ‘ఆమె’ కీలకం

image

నిర్మల్ జిల్లా పెద్ద బెల్లాల్‌కి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మహిళలు TGPSC ద్వారా ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. జాడి విజయలక్ష్మి ఆర్‌అండ్‌బీ శాఖలో ఏఈగా, ఆమె వదిన చంద్రకళ వీఆర్వోగా, మరో వదిన జ్యోతి గ్రూప్-2 ద్వారా ఎంపీఓగా ఎంపికయ్యారు. ప్రస్తుతం జ్యోతి సోన్ మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన వీరిపై ప్రశంసలు వస్తున్నాయి.
HAPPY WOMENS DAY

News March 8, 2026

నెల్లూరు: వారిని జైలు కలిపింది.!

image

ఆ ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు. వీరిలో రామకృష్ణపై 27 కేసులు, మరో నిందితుడు బిట్రగుంటకు చెందిన మాల్యాద్రిపై14 కేసులు ఉన్నాయి. జైలులో వీరికి పరిచయం ఏర్పడడంతో మరిన్ని చోరీలకు కలిసికట్టుగా చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా చిన్న బజార్ PS పరిధిలో <<19323990>>చేతివాటం<<>> చూపగా ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.63 వేల నగదు, 153 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

News March 8, 2026

ములుగులో అంతర్జాతీయ సదస్సు

image

ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 10, 11 తేదీల్లో “కథా సాహిత్యం-సామాజిక చైతన్యం” అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు బ్రోచర్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. కథా సాహిత్యం, సామాజిక చైతన్యానికి మధ్య గల సంబంధాన్ని అంతర్జాతీయ కోణంలో ఈ సదస్సులో చర్చించనున్నట్లు సంచాలకులు బి.బాలయ్య తెలిపారు.