News March 5, 2026

మంచిర్యాల: అక్కాచెల్లెళ్లకు ఆర్మీ ఉద్యోగాలు

image

జన్నారం మండలంలోని గాంధీ నగర్‌కు చెందిన బొమ్మిడి శ్రావ్య, ప్రవళిక అనే అక్కా చెల్లెళ్లు ఇండియన్ మిలిటరీలో ఉద్యోగాలు సాధించారు. గాంధీనగర్‌కు చెందిన బొమ్మిడి రాజేందర్ కుమార్తెలైన శ్రావ్య, ప్రవళిక మిలటరీ పరీక్షను రాసి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బుధవారం వారిని జన్నారం మండల కేంద్రంలోని పలువురు ప్రముఖులు సన్మానించారు.

Similar News

News April 5, 2026

క్రెడిట్ చోరీ కోసం వైసీపీ విశ్వ ప్రయత్నాలు: మంత్రి కొండపల్లి

image

భోగాపురం విమానాశ్రయ క్రెడిట్‌ను వైసీపీ తమదిగా చూపించుకునే ప్రయత్నం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కాలంలోనే శంకుస్థాపన జరిగి సుమారు 2,600 ఎకరాల భూసేకరణ పూర్తయిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం 300 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేశారని, ఆ నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం చేయలేదని ఆరోపించారు.

News April 5, 2026

విజయవాడలో ఉగ్ర లింకుల కేసు కస్టడీ పూర్తి

image

విజయవాడలో సంచలనం సృష్టించిన ఉగ్ర లింకుల కేసులో నిందితుల పోలీసు కస్టడీ ముగిసింది. విచారణలో నిందితులు సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలతో వీరికి ఉన్న సంబంధాలపై లోతైన విచారణ జరిపారు. లభించిన కీలక ఆధారాలతో నిందితులపై పక్కాగా చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. నగరంలో ఈ ఉగ్ర కోణం తీవ్ర చర్చనీయాంశమైంది.

News April 5, 2026

ఎన్నికల విధులకు వెళ్తూ ఏలూరు CRPF SI మృతి

image

ఏలూరుకు చెందిన CRPF SI గోపిరెడ్డి హేమంత్ పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల విధులకు వెళ్తూ రైలు ప్రమాదంలో మృతి చెందారు. ఢిల్లీ నుంచి బెంగాల్ వెళ్తుండగా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఆయన మృతదేహాన్ని ఏలూరులోని స్వగృహానికి తీసుకురానున్నారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.