News March 5, 2026

ఆసిఫాబాద్ జిల్లాలో విద్యుత్ సరఫరా బలోపేతం: ఎస్ఈ

image

ASF జిల్లాలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తున్నామని విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే తెలిపారు. జిల్లాకు మంజూరైన 14 ట్రాన్స్‌ఫార్మర్లలో 7 ఇప్పటికే ఏర్పాటు చేశామని చెప్పారు. ఓవర్‌లోడ్ నియంత్రణకు ఏబీ స్వీచ్‌లు అమర్చుతున్నామని పేర్కొన్నారు. దహెగాం, గుండాయపేట్, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో 33 కేవీ లైన్లకు కవర్ కండక్టర్లు అమర్చి 70 కి.మీ కేబుల్ వేసినట్లు తెలిపారు.

Similar News

News April 6, 2026

VKB: ‘అధికారులు కీలక భూమిక పోషించాలి’

image

ప్రజావాణికి వచ్చే వినతులను పరిష్కరించడంలో అధికారులు కీలక భూమిక పోషించాలని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి నమ్మకంతో వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఒకసారి దరఖాస్తు చేసుకున్న సమస్యలను వెను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు.

News April 6, 2026

మరణంలోనూ వీడని బంధం!

image

తోడుగా నడిచిన ఆ ప్రాణాలు.. వీడలేక మరణంలోనూ ఒకరి వెంట ఒకరు అనంతలోకాలకు పయనమయ్యారు. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యంలో షేక్షాబు, శేకమ్మ దంపతులు అనారోగ్యంతో ఆదివారం 3 గంటల వ్యవధిలోనే ఇరువురూ కన్నుమూశారు. షేక్షాబు మధ్యాహ్నం 3 గంటలకు మరణించగా ఆ బాధలో భార్య శేకమ్మ సాయంత్రం 6 గంటల సమయంలో ప్రాణాలు విడిచారు. చావులోనూ వీడని ఈ దంపతుల బంధం గ్రామస్థులను కన్నీటిపర్యంతం చేసింది.

News April 6, 2026

డెలివరీ ఏజెంట్స్ లిఫ్ట్ వాడొద్దా.. మీరేమంటారు?

image

ప్రస్తుతం అన్నీ డోర్ డెలివరీలే. కానీ వాటిని చేరవేసే వారికి మాత్రం కనీస గౌరవం దక్కట్లేదు. కొన్ని అపార్ట్‌మెంట్లలో డెలివరీ బాయ్స్ లిఫ్ట్ వాడొద్దని ఆంక్షలు పెట్టి, వాడితే జరిమానాలు వేస్తున్నారు. 2AMకు కూడా మెట్లు ఎక్కి రావాలనే కస్టమర్ల ప్రవర్తన తమను అవమానపరచడమే అని ఓ డెలివరీ ఏజెంట్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. వారు కూడా మనుషులేనని, వారికి కనీస మర్యాద ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మీ కామెంట్?