News May 4, 2024
కుక్కలకూ ఆధార్.. క్యూఆర్ కోడ్‌తో ట్యాగ్‌లు

ఢిల్లీలో కుక్కలకు ఆధార్ కార్డులు ఇస్తున్నారు. Pawfriend.in అనే NGO వీటిని తయారు చేయించి ఇప్పటికే 100 కుక్కలకు జారీ చేసింది. ఇండియా గేట్, ఎయిర్‌పోర్ట్‌లోని టర్మినల్ 1 సహా పలు ప్రాంతాల్లోని కుక్కలకు ఈ కార్డ్‌లు మెడలో వేశారు. వీధి కుక్కల సంరక్షణకు ఇదో మంచి పరిష్కారమని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. కుక్కలు తప్పిపోయినా, దాడికి పాల్పడినా QR కోడ్ స్కాన్ చేస్తే ఆ కుక్క ఏ వీధికి చెందినదో తెలుస్తుంది.
Similar News
News March 10, 2026
సల్మాన్ మూవీలో హీరోయిన్‌గా సమంత?

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోయే సూపర్ హీరో ఫిల్మ్‌లో సమంత హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. రాజ్&డీకే ద్వయం ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హ్యూమర్+యాక్షన్ ఉంటుందని సమాచారం. కాగా డైరెక్టర్ల ద్వయంలో ఒకరైన రాజ్‌ను సామ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘మా ఇంటి బంగారం’ సినిమాతో పాటు ‘రక్త బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.
News March 10, 2026
యుద్ధం.. పడిపోతున్న బియ్యం ధరలు

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం వరి రైతులపైనా ప్రభావం చూపుతోంది. చెన్నై పోర్టు నుంచి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం ఎగుమతులు ఆగిపోగా, ఇప్పటికే బయల్దేరిన కంటైనర్లూ వెనక్కి వచ్చేశాయి. దీంతో వారం కిందటి వరకు పుట్టి(850KG) ధాన్యం ధర ₹22,500 ఉండగా ప్రస్తుతం ₹21Kకు పడిపోయింది. ఇంకొన్ని రోజులు ఎక్స్‌పోర్ట్స్ నిలిచిపోతే రేట్లు మరింత పతనం కానున్నాయి. అలాగే $11.8Bn విలువైన ఆహారోత్పత్తుల ఎగుమతులపైనా ప్రభావం పడనుందని అంచనా.
News March 10, 2026
ఫైళ్ల దహనం వెనకున్న ప్లాన్ ఏంటో తేలాలి: సుప్రీంకోర్టు

AP: మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన ఫైళ్ల దహనం తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రికార్డు రూమ్‌లో మంటలు ఎలా అంటుకున్నాయి? దాని వెనకున్న ప్లాన్ ఏంటో లోతుగా విచారించాల్సి ఉందని తెలిపింది. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి సహా ఇతర నిందితుల ముందస్తు బెయిల్‌కు నిరాకరించింది. ఘటన సమయంలో నిందితుడు విదేశాల్లో ఉన్నారనే కారణంతో విచారణ నుంచి తప్పించుకోలేరని పేర్కొంది.


