News March 5, 2026
పెద్దపల్లి జిల్లాలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ ప్రారంభం

మార్చి 6 -15 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని, గ్రామాలు, పట్టణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ 10 రోజుల్లో క్లియర్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో హెల్త్, సంక్షేమం, విద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమం, పర్యావరణ కార్యక్రమాలు చేపడతారు. వారివారీ ఫీల్డ్ తనిఖీలు, స్థానిక సంస్థల ఫోకస్, పాఠశాల పరిశీలన, ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.
Similar News
News March 11, 2026
ప్రకాశం: వడగాల్పులపై ముందస్తు చర్యలు

ప్రకాశం జిల్లాలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల సమయాల్లో మార్పులు చేయాలని, మధ్యాహ్నం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి బోర్లు మరమ్మతు చేసి, నీటి కొరత లేకుండా చూడాలని అన్నారు.
News March 11, 2026
నిర్మల్: మైనారిటీ యువతకు ఉచిత శిక్షణ

నిర్మల్ జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభం కానుందని జిల్లా సంక్షేమ అధికారి ఆర్.మోహన్ సింగ్ తెలిపారు. యువతకు ఉపాధి, స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 12, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
News March 11, 2026
నెక్లెస్ రోడ్ నీరా కేఫ్ భవనం లీజుకు టెండర్ల ఆహ్వానం

నెక్లెస్ రోడ్ వద్ద ఉన్న నీరా కేఫ్ భవనాన్ని లీజుకు ఇవ్వడానికి తెలంగాణ TD టాపర్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది. ఈ భవనంలో నీరా ప్రాసెసింగ్ యూనిట్, బ్యాంకెట్ హాల్‌తో పాటు 7 వాణిజ్య దుకాణాలు ఉన్నట్లు మేడ్చల్ జిల్లా BC అభివృద్ధి శాఖ అధికారి ఝాన్సీరాణి తెలిపారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో గౌడ వృత్తికి చెందిన సంఘాల నుంచి నిర్దిష్ట నిబంధనలు, మేరకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు.


