News March 5, 2026
ఇరాన్ సంచలన ప్రకటన.. భారత్‌కు గుడ్‌న్యూస్!

హార్ముజ్ నుంచి అన్ని దేశాలకు చమురు సరఫరా నిలిపివేయట్లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో INDతో పాటు మరికొన్ని దేశాలకు భారీ ఊరట లభించింది. త్వరలోనే మన షిప్స్ రవాణా మొదలవ్వొచ్చు. ఇక తమ నౌకాదళంతో హార్ముజ్‌లోని వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తామన్న US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. జలసంధిని నియంత్రించే అధికారం తమకుందని, US, ఇజ్రాయెల్, యూరప్ వెళ్లే నౌకలకు ఎంట్రీ ఉండదని తేల్చి చెప్పింది.
Similar News
News April 20, 2026
ప్రభుత్వ ఉద్యోగాల్లో 95% స్థానికులకే: ప్రభుత్వం

AP: GOVT ఉద్యోగాల్లో 95%పోస్టులు స్థానికులకే కేటాయించనున్నారు. 2025 రాష్ట్రపతి ఉత్తర్వులపై కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ప్రభుత్వం GO45 జారీ చేసింది. రాష్ట్రాన్ని 6జోన్లుగా, 2మల్టీ జోన్లుగా చేసింది. ఆయా క్యాడర్ పోస్టుల్లో 95% లోకల్‌కు, మిగతావి జనరల్ కోటాలో భర్తీ చేస్తారు. లోకల్‌గా పరిగణించాలంటే క్వాలిఫయింగ్ ఎగ్జామ్ వరకు వరుసగా 4ఏళ్లు జిల్లాలో చదివి ఉండాలి. లేదా పేరెంట్స్ 4ఏళ్లు నివాసం ఉండాలి.
News April 20, 2026
అఫిడవిట్లలో రూ.100 కోట్ల తేడా?.. విజయ్‌కి హైకోర్టు నోటీసులు

TVK అధినేత విజయ్‌కి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్లలో అవకతవకలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. EC, IT శాఖకూ నోటీసులిచ్చింది. ‘విజయ్ ఎన్నికల వివరాల్లో పరస్పర విరుద్ధమైన విషయాలు ఉన్నాయి. తిరుచ్చి తూర్పు అఫిడవిట్లో తన చరాస్తులు ₹224 కోట్లుగా, పెరంబూర్ అఫిడవిట్లో ₹105 కోట్లుగా చూపించారు. ₹100 కోట్ల తేడా ఉంది’ అని పిటిషనర్ వి.విఘ్నేశ్ ఆరోపించారు.
News April 20, 2026
శాంతి చర్చలకు వెళ్లం.. స్పష్టం చేసిన ఇరాన్

అమెరికాతో రెండో విడత శాంతి చర్చలకు వెళ్లేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. షెడ్యూల్ ప్రకారం అతిత్వరలో ఇస్లామాబాద్ వేదికగా 2 దేశాలు మరోసారి చర్చలు జరపాల్సి ఉంది. కానీ అమెరికా సీజ్ఫైర్ నిబంధనలను ఉల్లంఘిస్తుండటంతో తాము చర్చలకు రాబోమని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ స్పష్టం చేశారు. దీంతో మరోసారి యుద్ధం తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. దీని ప్రభావం ప్రపంచ దేశాలపైనా పడనుంది.


