News March 5, 2026

మెదక్‌లో ఉమ్మడి జిల్లా సమావేశం.. మంత్రుల రాక

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’పై ఈనెల 6న మెదక్ ఐడీఓసీలో ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం జరగనుంది. ఈ భేటీకి ఇన్చార్జ్ మంత్రి వివేక్, మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరుకానున్నారు. ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో కలిసి ప్రణాళిక అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News April 18, 2026

ASF: జాతీయ లోక్ అదాలత్.. జూన్ 20కు మార్పు

image

తెలంగాణ రాష్ట్ర సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మే 9న నిర్వహించాల్సిన జాతీయ లోక్ అదాలత్‌ను జూన్ 20వ తేదీకి వాయిదా వేసినట్లు ఆసిఫాబాద్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి తెలిపారు. మే 7వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు వేసవి సెలవులు ఉండటంతో లోక్ అదాలత్ నిర్వహణ తేదీని మార్పు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలన్నారు.

News April 18, 2026

ASF: ఇంటర్ ఫలితాలపై సమీక్ష చేసిన డీఐఈఓ

image

ఆసిఫాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్స్‌తో శనివారం సమావేశం జరిగింది. కాలేజీల వారీగా 1వ, 2వ సంవత్సరం ఫలితాలపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రాందాస్ సమీక్ష నిర్వహించారు. ఫలితాల్లో ఉన్న లోపాలను గుర్తించి వాటి మెరుగుదలకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే FRS అమలు, అడ్మిషన్ డ్రైవ్‌ను వేగవంతం చేయడం, విద్యార్థుల హాజరు శాతం, అకాడమిక్ పనితీరుపై చర్చించారు.

News April 18, 2026

GOOD NEWS: ఇంటర్ సెకండియర్‌కూ ఇంప్రూవ్‌మెంట్

image

AP: ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు బోర్డ్ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నుంచి ఫెయిల్, పాసైన విద్యార్థులు సైతం ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చని ప్రకటించింది. ఏ సబ్జెక్టులో మార్కులు తగ్గితే ఆ సబ్జెక్ట్ రాయొచ్చని, ప్రతి పేపర్‌లో ఎక్కువ వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటామంది. దీనివల్ల మంచి కాలేజీల్లో సీటు రాకపోవడం, ఒత్తిడికి లోనవడం లాంటివి తగ్గే అవకాశం ఉందని బోర్డు తెలిపింది.