News May 4, 2024
HYD సిటీ కాలేజీలో ఇంటర్వ్యూలు

HYDలోని ప్రభుత్వ సిటీ కళాశాల(అటానమస్)లో తాత్కాలిక అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థులు ఈనెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూకి హాజరు కావాలని ప్రిన్సిపల్ ఆచార్య పి.బాల భాస్కర్ తెలిపారు. బయో టెక్నాలజీ విభాగంలో ఖాళీగా ఉన్న 2 పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులున్న అభ్యర్థులు అర్హులని, పీహెచ్‌డీ, ఎం.ఫిల్, నెట్, స్లెట్ అదనపు అర్హతలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
Similar News
News March 7, 2026
VFX హబ్‌గా HYD.. ప్రారంభించనున్న సీఎం

ప్రముఖ OTT సంస్థ నెట్ ఫ్లిక్స్ తన కార్యాలయాన్ని హైదరాబాదHలో ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 12న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు దీనిని ప్రారంభించనున్నారు. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ స్టూడియోను ప్రారంభించనుంది. భారతదేశంలో తనకు రెండో కార్యాలయం కానుంది. దీని ద్వారా VFX, గేమింగ్ కామిక్స్ రంగంతో పాటు వివిధ రంగాలలో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని చెబుతున్నారు.
News March 7, 2026
HYDలో DANGER కంటి‘న్యూస్’

నగరంలో గాలి నాణ్యత పడిపోతుండటంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రెండంకెల స్థాయిలో ఉండాల్సిన గాలి నాణ్యత సూచీ శనివారం బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో అత్యధికంగా 248గా నమోదైంది. వాహనాల పొగ, చెత్తాచెదారం తగలబెట్టడం కారణంగా కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ప్రజలు మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.
News March 7, 2026
HYDకు చేరువలో అద్భుతమైన అందాలు.. వెళ్దామా?

HYD నగరానికి చేరువలో నల్లమల అడవుల అందాలను ఆస్వాదించాలనుకునే వారికి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వేదికగా నిలుస్తోంది. ఇక్కడి ‘మన్ననూర్ జంగిల్ రిసార్ట్’లో పులుల సఫారీ, పక్షుల కిలకిలరావాల మధ్య ఉదయం ట్రెక్కింగ్ వంటివి పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. స్థానిక చెంచులతో కలిసి అడవి రహస్యాలను తెలుసుకునే వీలుంది. ఆధునిక వసతులు, భోజన సౌకర్యాలతో కూడిన ఈ పర్యాటక ప్యాకేజీ కోసం <


