News May 4, 2024

బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్

image

భారత్ ‘xenophobic’ (విదేశీయులంటే భయపడటం) అని US అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి జైశంకర్ తోసిపుచ్చారు. ‘భారత్ ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటోందన్న ఆయన వ్యాఖ్యల్లో నిజం లేదు. భారత్ జెనోఫోబిక్ కాదు. ప్రపంచ చరిత్రలో వివిధ వ్యక్తులు, సమాజాలను స్వాగతించే దేశాల్లో భారత్‌ది ప్రత్యేకమైన స్థానం. అందుకే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు సీఏఏ తెచ్చాం’ అని పేర్కొన్నారు.

Similar News

News January 2, 2025

ఈ ఏడాది ‘తల్లికి వందనం’ లేనట్లేనా?

image

AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆర్థిక లోటుతో ఈ స్కీమ్‌ను ఇప్పట్లో అమలు చేయలేమని చెప్పేశారు. కాగా ఎన్నికలకు ముందు ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ వర్తింపజేస్తామని NDA కూటమి హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం రావడంతో 80 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని బాంబు పేల్చారు.

News January 2, 2025

సిడ్నీ టెస్టుకు భారత జట్టులో భారీ మార్పులు?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ టెస్టు కోసం టీమ్ ఇండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో శుభ్‌మన్ గిల్, ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక జట్టుకు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తారని టాక్. ప్రాబబుల్ జట్టు: బుమ్రా, రాహుల్, జైస్వాల్, గిల్, కోహ్లీ, పంత్, జడేజా, నితీశ్, సుందర్, ప్రసిద్ధ్, సిరాజ్.

News January 2, 2025

₹550 CRతో కూతురి పెళ్లి! బికారిగా మారిన తండ్రి!

image

కర్మ! అన్ని సరదాలూ తీర్చేస్తుందనడానికి ఇదే ఉదాహరణ. అపర కుబేరుల్లో ఒకరైన లక్ష్మీమిత్తల్ బ్రదరే ప్రమోద్. 2013లో కుమార్తె సృష్టి పెళ్లికి రూ.550CR ఖర్చు చేసిన ఆయన ఇప్పుడు దివాలా తీసి బికారిగా మారి జైలుకెళ్లారు. ఆయన గ్యారంటర్‌గా ఉన్న GIKIL కంపెనీ $116mln రుణం తీర్చకపోవడంతో పతనం మొదలైంది. మోసం కేసులో 2019లో బోస్నియాలో అరెస్టయ్యారు. దివాలా తీసి భార్య, బిడ్డల నుంచి నెలవారీ ఖర్చుల కోసం దేహీ అంటున్నారు.