News March 5, 2026

పెద్దపల్లి: ప్రతి పౌరుడికి ఆధార్ అందేలా చర్యలు: కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో గురువారం ఆధార్ అప్‌డేట్ సమీక్ష నిర్వహించారు. ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి అని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డులు సమయానికి అప్‌డేట్ చేయాలని, ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా పాఠశాలల్లో విద్యార్థులకు ఆధార్ అందించడానికి పర్యటనలు నిర్వహించాలని సూచించారు.

Similar News

News March 7, 2026

జనాభా పెంపునకు గుంటూరులో పైలెట్ ప్రాజెక్ట్..?

image

రాష్ట్రంలో తగ్గుతున్న జననాల రేటును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త జనాభా నిర్వహణ విధానాన్ని సిద్ధం చేస్తోంది. పైలెట్ ప్రాజెక్ట్‌గా గుంటూరు జిల్లాను ఎంపిక చేసే అవకాశముంది. కుటుంబాలకు ప్రోత్సాహక ప్యాకేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ చికిత్సకు సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తోంది. జననాల రేటు పెంచేందుకు మాతృత్వ సేవలు, మహిళా సాధికారత వంటి అంశాలపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.

News March 7, 2026

నెల్లూరు: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో రూ.16 లక్షల నగదు చోరీ

image

కొండాయపాలెం నందనవనానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీధర్ రెడ్డి బీరువాలో ఉన్న రూ. 16.50 లక్షల నగదు, 55 గ్రాముల బంగారు చోరీకి గురైందని వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అసిస్టెంట్ శ్రీనివాసులు అనే వ్యక్తికి నగదుబీరువాలో ఉంచమని ఇచ్చారు. అనంతరం నిద్రపోయే లేచి చూడగా బీరువాలో నగదు, బంగారు, పార్కింగ్‌లో ఉన్న బైక్ కనపడలేదని అన్నారు. తన అసిస్టెంట్‌పై అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు.

News March 7, 2026

GNT: దుష్ట శక్తులు వదిస్తామని.. రూ.53 లక్షలకు చిల్లు

image

దుష్టశక్తుల నుంచి విముక్తి కోసం రూ.53 లక్షలు చెల్లించి విద్యుత్ శాఖ లైన్ మెన్ మోసపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టాభిపురం పోలీసులు కేసునమోదు చేశారు. ఉద్యోగనగర్‌కి చెందిన విద్యుత్ శాఖ లైన్ మెన్ మాణిక్యం బాబుకి.. శంకర్ అనే ఆధ్యాత్మిక గురువును వెంకటసాయి రామ్ పరిచయం చేశాడు. ఈ క్రమంలో విడతల వారీగా మాణిక్యం డబ్బు చెల్లించాడు. మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించి ఫిర్యాదు చేయగా ఆరుగురిపై కేసు నమోదైంది.