News March 5, 2026

సిరిసిల్ల జిల్లాలో నలుగురు సీఐల బదిలీ

image

సిరిసిల్ల జిల్లాలో పలువురు సీఐలు బదిలీ చేస్తూ మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ పీసీఆర్‌లో పనిచేస్తున్న ఓదెల వెంకటేశ్ ఎల్లారెడ్డిపేటకు, అక్కడ పనిచేస్తున్న శ్రీనివాస్ గౌడ్ ఐజీపీ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. డీసీఆర్బీగా పనిచేస్తున్న నాగేశ్వరరావు సిరిసిల్ల రూరల్ సర్కిల్‌కు బదిలీ కాగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న మొగిలి సిరిసిల్ల డీసీఆర్బీకి బదిలీ అయ్యారు.

Similar News

News March 12, 2026

ఏదులాపురం: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి, కలెక్టర్

image

ఏదులాపురం మున్సిపాలిటీలోని వరంగల్ క్రాస్ రోడ్ పరిధిలో మసీదు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు భక్తి భావానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

News March 12, 2026

ఖమ్మం: పార్లమెంట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ

image

బీఆర్‌ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర బొగ్గు శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. గురువారం పార్లమెంట్ అనెక్స్ హాలులో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బొగ్గు సంస్థల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాల్సిన అవసరాన్ని ఎంపీ రవిచంద్ర సూచిస్తూ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

News March 12, 2026

వైద్యులపై ఎంజీఎం సూపరింటెండెంట్ సీరియస్

image

ఎంజీఎంలో వైద్యుల సమయపాలనపై సూపరింటెండెంట్ హరీష్ చంద్రా రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఓపీ విభాగంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉదయం 9:30 గంటలైనా జనరల్ మెడిసిన్, సర్జికల్, ఆర్థో, ఏఎంసీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తప్పవని సంబంధిత వైద్యులను హెచ్చరించారు.