News May 4, 2024

HYD: కాంగ్రెస్ వద్దు.. BRS కావాలంటున్నారు: MLA

image

BRS సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని అంబర్‌పేట్ MLA కాలేరు వెంకటేశ్ అన్నారు. శనివారం గోల్నాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అసత్య ప్రచారంతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రజల్లో మార్పు మొదలైందని, కాంగ్రెస్ వద్దు.. BRS కావాలంటున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో BRS వైపే ప్రజలు ఉన్నారని అన్నారు.

Similar News

News March 5, 2026

HYD: చదువుకొనే పిల్లలనూ వదలడం లేదు!

image

JNTUHలో ప్రైవేటు సంస్థల జోక్యం వివాదానికి దారితీసింది. స్టూడెంట్స్‌కు క్రెడిట్ కార్డుల ఆశ చూపుతూ ECE డిపార్ట్‌మెంట్ వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ అనిత అనుమతితోనే తాము పెట్టామని సదరు సంస్థ ప్రతినిధులు తెలపడంపై విమర్శలొస్తున్నాయి. చదువుకొనే వయసులో క్రెడిట్ కార్డులు ఇచ్చి వారిని అప్పుల ఊబిలోకి నెట్టడమేంటని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై మీ కామెంట్?

News March 5, 2026

HYD: గ్రేట్ సర్.. మరణించినా ప్రాణాలు కాపాడారు!

image

తాను మరణించిన ఆరుగురికి రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంబాదాస్ ప్రాణం పోశారు. అమీన్‌పూర్‌ బృందావన్ టీచర్స్ కాలనీలో ఉంటున్న అంబాదాస్(63) అధిక రక్తపోటుతో బాధ పడేవారు. ఫిబ్రవరి 28న ఒక్కసారిగా కుప్పకూలగా నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మార్చి 3న బ్రెయిన్ డెడ్ కావడంతో ఆర్గాన్స్‌ను డొనేట్ చేసేందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకున్నారు. కుటుంబ నిర్ణయం స్ఫూర్తిదాయకం అని సజ్జనార్ ట్వీట్ చేశారు.

News March 5, 2026

HYD: నేటి నుంచి 1Oth హాల్ టికెట్స్

image

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌ <>bse.telangana.gov.in<<>>లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నాంపల్లి SSC బోర్డు ప్రకటించింది. మార్చి 14- ఏప్రిల్ 16 వరకు ఉ.9:30 నుంచి మ.12:30 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ముందుగానే సెంటర్ తెలుసుకుని నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.