News May 4, 2024
ఓయూలో ఈనెల 16 నుంచి డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు

ఓయూ పరిధిలో మే 16 నుంచి డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, ఇతర డిగ్రీ కోర్సులు చదివి ఫెయిలైన పూర్వ విద్యార్థులకు పరీక్ష రాసుకునేందుకు ఒక్క అవకాశం ఇచ్చిన విషయం విదితమే. వన్ టైమ్ ఛాన్స్ పరీక్షకు 15 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. వచ్చే వారం నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు కంట్రోలర్ చెప్పారు. SHARE IT
Similar News
News March 2, 2026
రాష్ట్రస్థాయి పోటీలకు కూచన్ పల్లి విద్యార్థిని

కూచన్ పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని అభినయ రాష్ట్ర స్థాయి మోడల్ యునైటెడ్ నేషన్స్ పోటీలకు ఎంపికైనట్లు MEO నాచారం మధుమోహన్ తెలిపారు. రెండు రోజుల క్రితం మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో కూచన్ పల్లి పాఠశాల నుంచి అభినయ, సాత్విక, సహస్రలు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 9వ తరగతి విద్యార్థిని అభినయ రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.
News March 1, 2026
మెదక్: రేపు యథావిధిగా ‘ప్రజావాణి’

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం లాగే రేపు ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా అధికారులందరూ సమయపాలన పాటిస్తూ విధిగా హాజరుకావాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.
News February 28, 2026
మెదక్: ఇన్‌ఛార్జ్ మంత్రిని కలిసిన కలెక్టర్!

మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మూడు రోజుల క్రితమే కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె, మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. ప్రభుత్వంపై నమ్మకం వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని కలెక్టర్ తెలిపారు.


