News March 5, 2026

జీవన్‌రెడ్డి ఆశలు గల్లంతు..!

image

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం మరోసారి మొండిచేయి చూపించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం, మున్సిపల్ ఎన్నికల్లో తనకు తక్కువ బి ఫారాలను ఇచ్చారని, ఇండిపెండెంట్ అభ్యర్థుల తరఫున జీవన్ రెడ్డి ప్రచారం చేశారు. అవకాశం దొరికినప్పుడల్లా అధిష్టానంపై విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో రాజ్యసభకు నామినేట్ చేస్తారని ఎదురుచూసిన ఆయన ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లింది.

Similar News

News March 10, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 10, 2026

అనిల్ రావిపూడి నుంచి యానిమేషన్ మూవీ?

image

కమర్షియల్ సినిమాలతో వరుస హిట్లు అందుకుంటున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి కొత్త జానర్‌లో మూవీ తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. లార్జ్ స్కేల్ యానిమేషన్ ప్రాజెక్టుపై ఆయన పనిచేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. KVN ప్రొడక్షన్స్ నిర్మించే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు ఇంకా చాలా టైమ్ పడుతుందని పేర్కొన్నాయి. కాగా ప్రస్తుతం వెంకటేశ్, కళ్యాణ్ రామ్‌తో అనిల్ ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు.

News March 10, 2026

ఈరోజు నమాజ్ వేళలు (10-3-2026) మంగళవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.16 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.29 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.25 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.