News May 4, 2024

ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చును నివారించలేమా?

image

ఈసీ నిబంధనల ప్రకారం MP అభ్యర్థి గరిష్ఠంగా ₹95 లక్షలు, MLA అభ్యర్థి ₹40 లక్షలు ఖర్చు పెట్టేందుకు అనుమతి ఉంది. వాస్తవంగా ఆ ఖర్చు రూ.కోట్లలో ఉంటోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నీళ్లలా పారుతోన్న నోట్ల కట్టలు కళ్ల ముందే కనిపిస్తున్నా సరైన చర్యలు ఉండట్లేదు. ఈ విపరీత వ్యయాన్ని నిలుపుదల చేయకపోతే తీవ్ర ప్రమాదమని, గెలిచిన అభ్యర్థుల అవినీతిని పెంచి పోషించడమేనని మేధావులు హెచ్చరిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News March 21, 2026

వాహనదారులకు రిలీఫ్.. ఎల్లుండి నుంచి..

image

TG: ఒకే పేరుపై రెండో వాహనం కొంటే అదనంగా కట్టాల్సిన 2% లైఫ్ ట్యాక్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నెల 23 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో వాహనదారులకు ఊరట లభించనుంది. ఇక అదే రోజున రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ పోర్టల్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ లాంచ్ చేయనున్నారు. రాష్ట్ర వాహనాల డేటా ఆ పోర్టల్‌తో అనుసంధానం కానుంది. దీంతో అంతర్రాష్ట్ర వాహనాల కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ఈజీ అవుతుంది.

News March 21, 2026

విడాకులపై స్పందించిన నిహారిక

image

తాను రిలేషన్‌షిప్ నుంచి బయటకు రావాలనుకున్నప్పుడు ముందుగా తన తండ్రికే చెప్పానని మెగా డాటర్ నిహారిక ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన మొత్తం విని సైలెంట్ అయ్యారని, తాను సంతోషంగా లేననే విషయం వాళ్లకూ తెలుసన్నారు. జీవితంలో సంతోషంగా లేకపోతే బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదని నాన్నే సలహా ఇచ్చారని పేర్కొన్నారు. తమ మధ్య వచ్చిన విభేదాలు పరిష్కరించుకోలేనివని, అందుకే 2023లో విడాకులు తీసుకున్నామని చెప్పారు.

News March 21, 2026

డియాగో గార్సియాపై ఇరాన్ దాడి.. ఖండించిన బ్రిటన్

image

ఇండియన్ ఓషన్‌లో ఉన్న US-UK మిలిటరీ బేస్‌ డియాగో గార్సియాపై <<19440362>>ఇరాన్ దాడిని<<>> బ్రిటన్ ఖండించింది. అలాగే గల్ఫ్ దేశాలపై దాడులను తప్పుపట్టింది. హార్ముజ్ జలసంధిని మూసేయడాన్ని తమకు, తమ మిత్ర దేశాలకు ముప్పుగా అభిప్రాయపడింది. ఈ యుద్ధంలో బ్రిటన్ నేరుగా పాల్గొనకపోయినా తమ స్థావరాలను వాడుకునేందుకు అమెరికాకు అనుమతించిన విషయం తెలిసిందే. అందుకే డియాగో గార్సియాను ఇరాన్ టార్గెట్ చేసింది.