News May 4, 2024
బిగ్‌బాస్ విన్నర్‌పై మనీలాండరింగ్ కేసు

బిగ్‌బాస్ ఓటీటీ 2 విన్నర్, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌పై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. రేవ్ పార్టీలు నిర్వహించి పాము విషాన్ని పంపిణీ చేసిన కేసులో ఎల్విష్ నిందితుడిగా ఉన్నాడు. మార్చి 17న నోయిడా పోలీసులు ఇతడిని అరెస్ట్ చేయగా తాజాగా ఈడీ మనీలాండరింగ్ కేసుతో దర్యాప్తు ముమ్మరం చేసింది. రేవ్ పార్టీలతో వచ్చిన నిధులు ఎటు మళ్లాయి? అనే కోణంలో దర్యాప్తు చేపట్టనుంది.
Similar News
News March 12, 2026
సముద్ర గర్భంలో మృత్యుపాశాలు!

సముద్ర గర్భంలో దాగి ఉండే ‘నావికా దళ మైన్స్’ అత్యంత ప్రమాదకరమైనవి. తాజాగా హార్ముజ్ జలసంధిలో ఇరాన్ వీటిని మోహరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి నౌకలను క్షణాల్లో ధ్వంసం చేయగలవు. ఓడల శబ్దం లేదా అయస్కాంత సెన్సార్ల ద్వారా ఇవి పేలుతాయి. అత్యంత ఆధునికమైన రైజింగ్ టార్పెడో, ఇన్‌ఫ్లుయెన్స్ మైన్స్ శబ్దాన్ని పసిగట్టి దాడులు చేస్తాయి. శత్రువును ముంచడమే కాదు, సముద్ర ప్రయాణాన్నే అసాధ్యం చేయగల సత్తా వీటికి ఉంది.
News March 12, 2026
మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్

కరోనా కాలంలో మొదలై ఇప్పుడిప్పుడే పూర్తిగా తగ్గుతున్న వర్క్ ఫ్రం హోమ్ విధానం గ్యాస్ కొరతతో మళ్లీ తెరపైకి వస్తోంది. ఇవాళ, రేపు WFH చేయాలని చెన్నై ఆఫీస్ ఎంప్లాయీస్‌కి HCL టెక్ మెయిల్ చేసింది. క్యాంపస్‌లోని కేఫ్‌లో గ్యాస్ కొరతే దీనికి కారణమని పేర్కొంది. చెన్నైతో పాటు HYD, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లోని ప్రముఖ సంస్థలనూ గ్యాస్ షార్టేజ్ వేధిస్తోంది. దీంతో WFHలు పెరిగే అవకాశం ఉంది.
News March 12, 2026
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక వార్నింగ్

గత 8 ఏళ్లుగా అసత్య ప్రచారం చేస్తూ ఆన్‌లైన్‌లో వ్యక్తిగతంగా అటాక్ చేస్తూ వేధిస్తున్నారని రష్మిక వాపోయారు. 24గంటల్లో వేధింపులు మితిమీరిపోయాయని పేర్కొన్నారు. తన ఫ్యామిలీని కూడా లాగారని, ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు. 24గంటల్లో ఆ కంటెంట్‌ను తొలగించకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ X వేదికగా వార్నింగ్ ఇచ్చారు. రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ రద్దు వార్తలపైనే ఆమె ఇలా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది.


