News May 4, 2024

శ్రీకాకుళం: ఆ ఛానెల్‌లో వచ్చిన వార్త అవాస్తవం

image

శ్రీకాకుళం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని అధికారులు శనివారం వెల్లడించారు. మూడు రోజులు పాటు 8 నియోజకవర్గ కేంద్రాల్లో ఓటు వేసేందుకు అవకాశం ఉందన్నారు. పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు క్యూలైన్లో ఉద్యోగులు వేచి ఉన్నట్లు తెలిపారు. ఓ ఛానల్‌లో నరసన్నపేటపై వచ్చిన వ్యతిరేక వార్త వాస్తవం కాదని సాఫీగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరుగుతుందని ఆర్వో రామ్మోహన్ స్పష్టం చేశారు.

Similar News

News March 5, 2026

టెక్కలి: ఈ నెలలో వివాహం.. అంతలోనే విషాదం

image

టెక్కలి (M) తలగాం గ్రామ సమీపంలో బుధవారం రైలు ఢీకొని ప్రవల్లిక అనే ఇంజినీరింగ్ విద్యార్థిని మృతిచెందిన విషయం విదితమే. మృతురాలిది నందిగాం మండలం వేణుగోపాలపురం గ్రామం. తండ్రి గోపాలరావు తాపీ మేస్త్రి, తల్లి శిరీష గృహిణి. టెక్కలిలో ఇంజినీరింగ్ 2వ ఏడాది చదువుతున్న పెద్ద కుమార్తె ప్రవల్లికకు ఈనెల 21వ తేదీన వివాహం జరగాల్సి ఉండగా ఇంతలోనే విషాదం నెలకొంది. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 5, 2026

శ్రీకాకుళంలో మార్చి 8న శాప్ లీగ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఎంపికలు

image

శ్రీకాకుళం జిల్లాలో ‘శాప్ లీగ్ – మాస్టర్స్ స్పోర్ట్స్ (వెటరన్స్)’ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి మహేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 8న శ్రీకాకుళం ఆర్ట్స్ గ్రౌండ్‌లో ఈ ఎంపికలు జరుగుతాయని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు https://sports.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

News March 4, 2026

శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

image

★శ్రీకాకుళం: టెన్త్ పాస్.. 230 ఖాళీలకు జాబ్ మేళా
★ సింగుపురం PHCకి కొత్త భవనం మంజూరు చేయాలి: MLA శంకర్
★టెక్కలి: రైలు ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
★ఆమదాలవలసలో అస్తవ్యస్తంగా రహదారులు
★SKLM: గిరిజనుల సాగు భూములకు పట్టాలివ్వాలి
★ఎచ్చెర్ల: పొలంలోనే టమాట పంటను వదిలేశారు
★ రెండు మాసాలు ముందే ఖరీఫ్‌కు సిద్ధం: అచ్చెన్నాయుడు
★ శ్రీకాకుళం: సకాలంలో పంచాయతీ ఎన్నికలు లేనట్లే ?