News March 6, 2026

తెలంగాణకు కొత్త గవర్నర్

image

కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది. తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లాను అపాయింట్ చేసింది. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. ఇక TG గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. నాగాలాండ్ గవర్నర్‌గా నంద్ కిశోర్ యాదవ్, బిహార్ గవర్నర్‌గా సయ్యద్ హస్నేన్, బెంగాల్ గవర్నర్‌గా R.N. రవిని నియమించింది.

Similar News

News April 17, 2026

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం: CM రేవంత్

image

TG: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత చరిత్రలో గుర్తుండిపోయే క్షణమని పేర్కొన్నారు. రాహుల్, ఖర్గే నాయకత్వంలో విపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాయని తెలిపారు. ‘స్టాలిన్, మమత, అఖిలేశ్, శరద్ పవార్, ఉద్ధవ్, లాలూ, హేమంత్ సోరెన్, ఫరూక్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, కమ్యూనిస్టు పార్టీల నేతలకు ధన్యవాదాలు. జైహింద్’ అని ట్వీట్ చేశారు.

News April 17, 2026

డీలిమిటేషన్ బిల్లు వెనక్కి.. కేంద్రానికి బిగ్ షాక్!

image

మహిళా రిజర్వేషన్లకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు <<19674859>>వీగిపోయింది.<<>> దీంతో డీలిమిటేషన్, యూటీ చట్ట సవరణ బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ పరిణామం ఎన్డీఏకు బిగ్ షాక్ లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విపక్షాలు ఏకతాటిపైకి రావడం ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొంటున్నారు. విపక్షాల అభ్యంతరాలను నివృత్తి చేయడంలో కేంద్రం విఫలమైందంటున్నారు. మీరేమంటారు?

News April 17, 2026

వీగిపోయిన మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు

image

మహిళా రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగులో పాల్గొన్నారు. అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. 2/3 <<19675689>>మెజార్టీ<<>>(352) లేకపోవడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు..