News March 6, 2026
నాగర్‌కర్నూల్: ఫోక్సో కేసులో 20 ఏళ్లు జైలు

ఫోక్సో కేసులో ఓ నిందితుడికి నాగర్ కర్నూల్ కోర్టు 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. NGKLలోని శ్రీపురం రోడ్డు సంజయ్ నగర్ కాలనీకి చెందిన సుజిత్ కుమార్(గణేష్) (21)పై 2024లో క్రైమ్ నెంబర్ 294 ఫోక్సో కేసు నమోదైంది. విచారణ అనంతరం జిల్లా స్పెషల్ జడ్జి నసీం సుల్తానా నిందితుడికి 20ఏళ్లు జైలు శిక్షతోపాటు రూ.20వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ సంగ్రామ్ జి పాటిల్ తెలిపారు.
Similar News
News April 17, 2026
నెల్లూరులో అమ్మాయిల పేరుతో మోసం

నెల్లూరు నగరంలోని ఓ యువకుడికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పేరుతో ఉన్న ఫేక్ ఐడి నుంచి మెసేజ్‌తోపాటు, కాల్ చేయగా అవతలి వ్యక్తి ఏడుస్తూ అత్యవసరంగా డబ్బులు కావాలని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇలాంటి భావోద్వేగపూరితమైన మాటలతో మాయ చేస్తూ నగదు కాజేసే సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. మీకు తెలిసిన వారు ఎవరైనా SM వేదికగా డబ్బులు అడిగితే పంపకుండా పోలీసులకు ఫిర్యాదు చేయండి.
News April 17, 2026
‘అక్షయ తృతీయ’ ఏ రోజున చేసుకోవాలి?

హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం. ఏటా వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తిథి రోజు దీన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ తిథి ఏప్రిల్ 19న 10.49AMకు మొదలై మరుసటి రోజు 7.27AMకు ముగుస్తుంది. అందువల్ల 19వ తేదీనే పండుగ జరుపుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆ రోజున 10.49AM-12.20PM మధ్య పూజకు మంచి సమయమని పేర్కొంటున్నారు.
News April 17, 2026
సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానమిదే!

APలో జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభమైంది. ప్రజలు se.census.gov.in పోర్టల్‌లో ఇంటిపెద్ద పేరు, మొబైల్ నంబర్, OTPతో లాగిన్ అయి జిల్లా, పిన్ కోడ్, గ్రామం/ పట్టణం వివరాలివ్వండి. మ్యాప్‌లో ఇంటి లొకేషన్ గుర్తించి, అడిగిన ప్రశ్నలన్నీ పూర్తి చేయాలి. ‘Final Submit’ చేయగానే Hతో మొదలయ్యే 11 అంకెల SE ID వస్తుంది. గణన సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీని చూపిస్తే సరిపోతుంది. ఈనెల 30 వరకూ చేయవచ్చు.


