News May 4, 2024
ఢిల్లీలో తొలిసారి.. ఎన్నికల బరిలో థర్డ్ జెండర్

లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి రాజన్ సింగ్(26) అనే థర్డ్ జెండర్ నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీలో పోటీ చేస్తోన్న తొలి థర్డ్ జెండర్ ఇతనే కావడం విశేషం. తాము ఎదుర్కొంటోన్న సమస్యలను అధికారులు, ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమకు సర్వీస్ ప్రొవైడర్ల వద్ద ప్రత్యేక వాష్‌రూమ్‌లు, క్యూలైన్లు, విద్య, ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజన్ కోరుతున్నారు.
Similar News
News March 18, 2026
‘హంట్’ మొదలుపెట్టిన రష్మిక!

వివాహ వేడుకలు పూర్తి చేసుకున్న హీరోయిన్ రష్మిక మందన్న తన తర్వాతి చిత్రం ‘మైసా’పై ఫోకస్ పెట్టారు. ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయిన విషయాన్ని తెలియజేస్తూ ‘ది హంట్ బిగిన్స్’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. గిరిజన తెగకు చెందిన మహిళగా ‘మైసా’లో రష్మిక కనిపించనున్నారు. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రావు రమేశ్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
News March 18, 2026
పంట మార్పిడి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

రైతులు ఏళ్లుగా అనుసరిస్తున్న ఏకపంట సాగును మానుకొని పంట మార్పిడిపై దృష్టిపెట్టాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల భూ భౌతిక, రసాయన మార్పులను నియంత్రించడమే కాకుండా, భూసారం, భూమిలో పోషకాల లభ్యత పెరుగుతుంది. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి. చీడపీడల ఉద్ధృతితో పాటు రసాయనాల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. పెట్టుబడి ఖర్చు తగ్గి పంట దిగుబడి పెరుగుతుంది.
News March 18, 2026
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: ద్రోణి ప్రభావంతో పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. అల్లూరి, పోలవరం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది. కాగా ఇప్పటికే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఆకాశాన్ని మబ్బులు కమ్మేయగా అనంతపురం జిల్లాలో అక్కడక్కడ వర్షం పడుతోంది.


