News March 6, 2026
HYD: హాస్టల్ నుంచి వెళ్లి.. VKBలో లవ్ మ్యారేజ్

పర్మిషన్ లేకుండా హాస్టల్ నుంచి ఓ విద్యార్థిని వెళ్లిపోయిన ఘటన ఘట్‌కేసర్ PS పరిధిలో జరిగింది. SHO బాలస్వామి వివరాలిలా.. వికారాబాద్(D) ధారూర్‌కు చెందిన విద్యార్థిని(19) అంకుషాపూర్ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కాలేజీలో 2nd ఇయర్ చదువుతోంది. ఈ నెల 4న హాస్టల్ నుంచి వెళ్లింది. ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. VKBలో ప్రియుడితో వివాహం చేసుకున్నట్లు లోకల్ PS నుంచి ఘట్‌కేసర్ ఠాణాకు సమాచారమందింది.
Similar News
News April 6, 2026
ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి: SP

కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో SP జి.బిందు మాధవ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి అందిన 24 ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు. వీటిలో 7 భూ తగాదాలు, 9 కుటుంబ కలహాలు, 8 ఇతర సమస్యలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించిన SP, వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News April 6, 2026
అన్నమయ్య జిల్లాలో దారుణ హత్య

అన్నమయ్య (D) చౌడేపల్లి (M) బోయకొండ అటవీ ప్రాంతంలో సోమవారం అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి ఓ వ్యక్తిని హత్య చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ చేపట్టినట్లు పుంగనూరు రూరల్ CI సాయి ప్రసాద్, SI చిన్నరెడ్డప్పలు తెలిపారు.
News April 6, 2026
వసతి గృహాలకు వాటర్ ప్యూరిఫైర్ల పంపిణీ

సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన నాలుగు వాటర్ ప్యూరిఫైర్లను సోమవారం ఆయన ప్రారంభించారు. వీటిని కదిరి ప్రాంతంలోని మూడు బీసీ, ఒక ఎస్సీ హాస్టళ్లకు పంపిణీ చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.


