News March 6, 2026

అల్లూరి: వాట్సాప్‌లో టెన్త్ హాల్ టికెట్స్..

image

టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులు వాట్సాప్ నంబర్ 955230009కి హాయ్‌ అని మెస్సేజ్ పెట్టి హల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అల్లూరి DEO రామకృష్ణరావు శుక్రవారం తెలిపారు. విద్యార్థులకు సులభంగా హాల్ టికెట్లు చేరువ చేయడానికి ప్రభుత్వం మనమిత్ర యాప్‌లో హాల్ టికెట్లను పొందుపరిచిందన్నారు. ఉమ్మడి అల్లూరి జిల్లాలో 264 పాఠశాలల్లో 11,457 మంది టెన్త్ విద్యార్థులకు 72 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News March 6, 2026

ఎల్లుండే ఫైనల్.. మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు?

image

అహ్మదాబాద్ వేదికగా IND-NZ మధ్య ఎల్లుండి T20WC ఫైనల్ జరగనుంది. వర్షం లేదా ఏదైనా కారణాలతో ఆ రోజు మ్యాచ్ జరగకపోయినా, మధ్యలో ఆగిపోయినా మరుసటి రోజు రిజర్వ్ డే ఉంటుంది. ఆగిన దగ్గర నుంచే మ్యాచ్ జరుగుతుంది. రెండు రోజులూ 120 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఫైనల్ ఫలితం తేలాలంటే ఇరు జట్లూ కనీసం 10 ఓవర్లు బ్యాటింగ్ చేయాలి. దురదృష్టవశాత్తూ 2 రోజులూ మ్యాచ్ జరగకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ఐసీసీ ప్రకటిస్తుంది.

News March 6, 2026

ముస్లిం దేశాల్లో పాక్ దగ్గరే న్యూక్లియర్ వెపన్.. ఎలా?(1/2)

image

ఇండియా 1974లో న్యూక్లియర్ టెస్ట్ చేయడంతో పాక్ వణికిపోయింది. ‘గడ్డి తినైనా సరే అణుబాంబు సాధిస్తాం’ అని అప్పటి PM భుట్టో శపథం చేశారు. సైంటిస్ట్ AQ ఖాన్ నెదర్లాండ్స్ నుంచి డిజైన్లు దొంగిలించి గ్లోబల్ బ్లాక్ మార్కెట్ సాయంతో ప్రాజెక్ట్-706 స్టార్ట్ చేశారు. పాక్ చేస్తున్నది తప్పని తెలిసినా రష్యాతో పోరాడేందుకు సాయపడుతుందని US సైలెంట్‌గా ఉండిపోయింది. చైనా సాయపడటంతో 1980ల నాటికే పాక్ లక్ష్యం చేరుకుంది.

News March 6, 2026

పాక్ ప్లాన్స్‌కు ఇజ్రాయెల్ చెక్.. భారత్ నో!(2/2)

image

ఇస్లాం దేశాల వద్ద న్యూక్లియర్ బాంబ్ ఉండడం రిస్క్ అని ఇజ్రాయెల్ ఫస్ట్ నుంచీ భావించింది. అందుకే పాక్ న్యూక్లియర్ ప్లాన్స్‌ను అడ్డుకునేందుకు కహుటా అణు కేంద్రాన్ని లేపేద్దామని అనుకుంది. అందుకోసం భారత ఎయిర్‌స్పేస్‌ను వాడుకుంటామని కోరింది. ముందు అంగీకరించిన ఇండియా.. పాక్‌తో అమెరికా క్లోజ్‌నెస్, JKలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందేమోనన్న ఆందోళనతో తర్వాత నో చెప్పింది.