News March 6, 2026
గద్వాల్: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు.. ఈ నెల 10 ఆఖరు

రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లలో 2026-27 ఏడాదిలో 6 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 10వ తేదీ వరకు గడువు ఉంది. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనతోపాటు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, టీపీటీ, సీఎస్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News March 11, 2026
ఈరోజు నమాజ్ వేళలు (11-3-2026) బుధవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.16 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.27 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 11, 2026
ఖమ్మం: వెలుగుమట్ల నిరాశ్రయులకు తీపికబురు

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ నిరాశ్రయులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మొత్తం 412 మందిని అర్హులుగా గుర్తించి, వీరిలో 311 మందికి బుధవారం ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయనుంది. మిగిలిన 101 మందికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని నిర్ణయించింది. కాగా, ఇప్పటికే రెవెన్యూ అధికారులు అర్హులైన బాధితులకు టోకెన్లు జారీ చేశారు.
News March 11, 2026
NTR: PG విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో పీజీ విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. నానో టెక్నాలజీ మినహా మిగతా కోర్సుల పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 1లోపు రూ.100 ఫైన్‌తో 2లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.


