News March 6, 2026
JGL: నాన్న అని పిలవలేని బాల్యం.. గణపతి కుమారుడి భావోద్వేగ గాధ

ఒక విప్లవం వెనుక సిద్ధాంతాలు, ఒక ఉద్యమం వెనుక రాజకీయ లక్ష్యాలు ఉంటాయి. కానీ ఉద్యమాల నీడలో కుటుంబం, తండ్రి, తల్లి, పిల్లల మధ్య బంధం నిశ్శబ్దంగా బలి అవుతాయి. మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావుA/Sగణపతి కొడుకు శ్రీనివాసరావు విడుదల చేసిన ఒక భావోద్వేగపూరిత సందేశం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నాన్న అని పిలవలేని బాల్యం నుంచి ఒక్కసారి చూడాలనే ఆత్రుత వరకు ఉన్న అనుబంధాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Similar News
News April 6, 2026
అనకాపల్లి జిల్లా ప్రజలకు అలర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు

అనకాపల్లి జిల్లాలో సోమవారం, మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిడుగులుతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం పడేటప్పుడు శిథిలావస్థ భవనాలు, కరెంట్ స్తంభాల వద్ద ఉండకూడదని సూచించారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు.
News April 6, 2026
నీలాదేవి భక్తికి మెచ్చిన శ్రీవారు..

అలా నీలాదేవి స్వామి వారికి తన వెంట్రుకలతో కట్టుకట్టడంతో ఆమె భక్తికి శ్రీవారు మెచ్చారు. తన దర్శనానికి విచ్చే భక్తులు తనపై భక్తి భావంతో సమర్పించే తలనీలాలు నీలాకే చెందుతాయని వరం ఇచ్చారట. కలియుగాంతం వరకూ నీలా దేవికి వెంట్రుకలు తొలగించబడిన స్థానంలో తిరిగి మొలుస్తాయని స్వామివారు పేర్కొన్నారట. ఆనాటి నుంచి నేటి వరకూ తిరుమల క్షేత్రంలో నిరంతరాయంగా తలనీలాల సమర్పణ కొనసాగుతుందని ఆగమ పండితులు అంటున్నారు.
News April 6, 2026
GVMCలో 79 గ్రామ పంచాయతీల విలీనం లేనట్టే..!

విశాఖ జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల 79 గ్రామ పంచాయతీలను GVMCలో విలీనం చేసే ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే జిల్లాలో 89% పట్టణ, 11% గ్రామీణ ప్రాంతం ఉంది. ఈ 4 మండలాల్లో సుమారు 4-5 లక్షల జనాభా కలరు. 2027 జనాభా గణన తర్వాతే పునర్విభజనకు అవకాశం ఉండటంతో అప్పటివరకు విలీనం ప్రతిపాదనలు అటకెక్కినట్టే తెలుస్తోంది.


