News March 6, 2026
ప్రజలకు జగన్ నరకం చూపిస్తున్నారు: CBN

AP: పరామర్శల పేరుతో జగన్ ప్రజలకు నరకం చూపిస్తున్నారని అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు విమర్శించారు. ‘గంజాయి బ్యాచ్ పరామర్శలకు వెళ్లడం సిగ్గుచేటు. వైసీపీ డ్రామాలతో అంబులెన్స్‌లు కూడా చిక్కుకుపోతున్నాయి. వాళ్ల వాహనాల టైర్లు మనుషులను తొక్కేస్తున్నాయి. మళ్లీ ఆ నిందను ప్రభుత్వంపైనే వేసే ప్రయత్నం చేస్తున్నారు. పోస్టుమార్టమ్‌కు కారణమైన వాళ్లు పోస్టుమార్టమ్‌కే వెళతారు’ అని సెటైర్ వేశారు.
Similar News
News March 10, 2026
యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేరా?: SC

యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేలా పునరావాస పథకం ఎందుకు తీసుకురాలేదని రాష్ట్రాలు, UTలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వారికి ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రంగాల్లో ఉపాధి కల్పించే పథకాన్ని రూపొందించాలని ఆదేశించింది. ఉద్యోగాలు ఇవ్వడంలో ఏవైనా సమస్యలుంటే జీవన భత్యం చెల్లించేలా పాలసీ తీసుకురావాలని సూచించింది. హరియాణాకు చెందిన ఓ యాసిడ్ బాధితురాలి కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
News March 10, 2026
లా, బీఈడీ కోర్సుల ఫీజులు ఖరారు

TG: రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో లా, బీఈడీ కోర్సుల ఫీజులు ఖరారయ్యాయి. 3 ఏళ్ల LLB కోర్సుకు కనిష్ట ఫీజు ₹20వేలు, గరిష్టంగా ₹40,300, ఐదేళ్ల LLB కోర్సుకు ₹20 వేలు, ₹44,800గా ఫిక్స్ చేశారు. పీజీ లా కోర్సు ₹26,000, ₹50,400గా ఉంది. బీఈడీకి కనిష్టంగా ₹16,500, గరిష్ట ఫీజు ₹50,800, ఎంఈడీ కోర్సుకు ₹25వేలు, ₹45వేలుగా నిర్ణయించారు. 2027-28 అకడమిక్ ఇయర్ వరకు ఇవే ఫీజులు ఉండనున్నాయి.
News March 10, 2026
సమ్మర్‌లో కరెంట్ బిల్ తగ్గాలంటే!

✦ ఫిలమెంట్ బల్బులు, ట్యూబ్ లైట్ల బదులు LED బల్బులు వాడాలి
✦ AC టెంపరేచర్‌ను 24-26°C మధ్య సెట్ చేయాలి. ఒక్క డిగ్రీ పెంచితే సుమారు 6% కరెంటు ఆదా
✦ AC ఆన్‌లో ఉండగా తక్కువ స్పీడ్‌లో ఫ్యాన్ కూడా ఆన్‌లో ఉంచితే రూమ్ త్వరగా చల్లబడుతుంది
✦ AC ఎయిర్ ఫిల్టర్‌ను 15 రోజులకోసారి శుభ్రం చేయాలి
✦ TV, ల్యాప్‌టాప్ ఛార్జర్, మైక్రోవేవ్ వంటివి స్టాండ్‌బై మోడ్‌లోనూ విద్యుత్ వాడతాయి. వాటిని ఆఫ్ చేయాలి


