News May 4, 2024
నాగర్‌కర్నూల్: ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు మృతి !
ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన కల్వకుర్తి మండలంలో శనివారం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. వంగూరు మండలానికి చెందిన వెంకటేశ్(28), జిల్లెల్ల గ్రామానికి చెందిన రాములు(29) బైక్‌పై కల్వకుర్తి వైపు నుంచి వెళ్తున్నారు. ఈ క్రమంలో తాండ్ర గ్రామ చౌరస్తాలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News January 3, 2025
MBNR: దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధి చిలుకూరులో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గద్వాల జిల్లా ధరూర్ మండలానికి చెందిన దంపతులు బతుకుదెరువు నిమిత్తం HYD వలస వచ్చి చిలుకూరులో ఉంటున్నారు. వారికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. గురువారం స్థానికంగా ఉండే ఓ యువకుడు చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి PSలో అప్పగించారు. కేసు నమోదైంది.
News January 3, 2025
MBNR: చదివింది చారెడు.. చికిత్సలు బారెడు!
అసలే గ్రామీణ ప్రాంతాలు.. అంతంతే వైద్య సేవలు. దీనినే పెట్టుబడిగా పెట్టుకుని పాలమూరులో కొందరు నకిలీ RMPలు చెలరేగిపోతున్నారు. చదివింది చారెడు.. చికిత్సలు బారెడు అనేలా.. వచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు సిఫార్సు చేస్తూ భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై DMHO కృష్ణ వివరణ కోరగా.. అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
News January 3, 2025
నల్లమల విద్యార్థికి బంగారు పతకం
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలంలోని ఉడిమిళ్ల గ్రామానికి చెందిన విద్యార్థి భరత్ గురువారం జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. భరత్ ప్రస్తుతం అచ్చంపేట రెసిడెన్సియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని పలువురు ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు.