News March 6, 2026
T20 ఫ్రాంచైజీని కొంటున్న ద్రవిడ్, అశ్విన్

యురోపియన్ T20 ప్రీమియర్ లీగ్‌లో భారత మాజీ క్రికెటర్లు ద్రవిడ్, అశ్విన్ భాగం కాబోతున్నారు. గ్లాస్గో ఫ్రాంచైజీని ఇండియాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ గ్రూపుతో కలిసి వారు కొనుగోలు చేయనున్నారని BBC Sport తెలిపింది. అందులోనే డచ్ ఫ్రాంచైజీని సౌతాఫ్రికా ఇన్వెస్టర్లు కొననున్నట్లు వెల్లడించింది. దీనిలో డుప్లెసిస్, క్లాసెన్, జాంటీ రోడ్స్ ఇన్వెస్టర్లుగా ఉన్నారు. 6 జట్లు ఉండే ఈ లీగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది.
Similar News
News March 20, 2026
శ్రీవారి సన్నిధిలో ఇక కల్తీకి చెక్: సత్యకుమార్

AP: శ్రీవారి లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాణ్యత, స్వచ్ఛత పెంచేలా చర్యలు తీసుకున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘తిరుమలలో ఏర్పాటైన స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని CM CBN రేపు ప్రారంభిస్తారు. నెయ్యి, నూనె, పాలు, ఇతర ముడిసరకుల్లో కల్తీని పసిగట్టే పరీక్షలు ఇక్కడ జరుగుతాయి. ఫెస్టిసైడ్స్, ప్రిజర్వేటివ్స్ వంటి అవశేషాలనూ గుర్తిస్తారు. పుణ్య క్షేత్రాల్లో ఇలాంటి ల్యాబ్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి’ అని తెలిపారు.
News March 20, 2026
ఇంటి పనులను భర్త షేర్ చేసుకోవాలి: సుప్రీంకోర్టు

తన భార్యకు వంట సహా ఇంటి పనులు సరిగ్గా చేయడం రాదంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలం మారిందని, ఇంటి పనులను భర్త కూడా షేర్ చేసుకోవాలని పేర్కొంది. ‘మీరు పనిమనిషిని కాదు.. జీవిత భాగస్వామిని పెళ్లి చేసుకున్నారు’ అని తెలిపింది. తన పేరెంట్స్‌కు ఆహారం పెట్టడానికి ఆమె నిరాకరించిందని భర్త కోర్టుకు చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
News March 20, 2026
‘ఎక్కడ ఉన్నా చంపేస్తాం’.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు, సైనికులకు ఇరాన్ IRGC స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘ప్రపంచంలో మీకు ఏ ప్రాంతం సురక్షితం కాదు. రిసార్టులు, టూరిస్టు ప్లేసులు ఇలా మీరు ఎక్కడ ఉన్నా చంపేస్తాం’ అని హెచ్చరించింది. కాగా ఇరాన్ ప్రతినిధులను వరుసగా చంపేస్తుండటంతో IRGC ఈ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
*ఇప్పటివరకు చదవని వార్తల కోసం పైన అన్‌రీడ్ బటన్ క్లిక్ చేసి అప్‌డేట్‌లో ఉండండి.


