News May 4, 2024
ఈ అభివృద్ధి చంద్రబాబుకు కనిపించడం లేదా?: జగన్
చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే అని జగన్ విమర్శించారు. ‘పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి. నా హయాంలో అభివృద్ధి లేదని ప్రచారం చేస్తున్నారు. కొత్తగా 4 ఓడరేవులు, 10 హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. ఇవి చంద్రబాబుకు కనిపించడం లేదా? నాడు-నేడుతో స్కూళ్లను అభివృద్ధి చేశాం. వాలంటీర్లతో పథకాలు చేరవేస్తున్నాం. మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చాం’ అని చెప్పారు.
Similar News
News December 28, 2024
BREAKING: కేటీఆర్‌కు ఈడీ నోటీసులు
TG: ఫార్ములా- ఈ రేసింగ్ కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని కోరింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని పేర్కొంది. ఫార్ములా-ఈ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కేటీఆర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
News December 28, 2024
రూ.6,000 కోట్ల పోంజీ స్కామ్.. నిందితుడు అరెస్ట్
రూ.6వేల కోట్ల పోంజీ స్కామ్ ప్రధాన నిందితుడు భూపేంద్రసింగ్‌ను సీఐడీ అరెస్టు చేసింది. గుజరాత్ మెహసానా జిల్లాలోని ఓ గ్రామంలో దాక్కున్న అతడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకుంది. బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో అయిన ఇతను బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి వేలాది మందిని మోసం చేశారు. కొన్ని నెలలుగా అతను సీఐడీకి దొరక్కుండా తిరుగుతున్నారు.
News December 28, 2024
శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలంటే?
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 66,715 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,503 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో రూ.4.06 కోట్ల హుండీ ఆదాయం చేకూరింది.