News May 4, 2024
గూడూరు: వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి

గూడూరు మండలం చెంబడిపాళెం దళితవాడకు చెందిన పల్లిపాటి గురవయ్య (45) అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. మృతుడు కూలి పనుల కోసం చెన్నూరు గ్రామానికి పోయి పనిచేస్తుండగా ఒకసారిగా స్పృహ తప్పి పడిపోయాడని బంధువులు తెలిపారు. అతనిని చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు దృవీకరించారు. మృతునికి భార్య బిడ్డలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
Similar News
News March 20, 2026
నెల్లూరు: గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు

నెల్లూరు రూరల్ అక్కచెరువుపాడు మైనార్టీ బాలురు గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు మార్చి 31వ తేదీ లోపు https://aprs.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు ఏప్రిల్ 24వ తేదీన పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు.
News March 20, 2026
నెల్లూరు: పెళ్లికి వెళ్తుండగా యాక్సిడెంట్.. ఒకరి స్పాట్ డెడ్

బైకును కంటైనర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన మనుబోలు హైవేపై చోటుచేసుకుంది. ఎస్సై శివ రాకేశ్ కథనం మేరకు.. కలువాయికి చెందిన శెట్టి పల్లి రమేశ్ (40) బైక్‌పై మల్లాంలో జరగబోయే వివాహానికి వెళుతుండగా చెన్నై వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొంది. ఈప్రమాదంలో రమేశ్ అక్కడక్కడే మృతి చెందాడు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 20, 2026
నెల్లూరు: 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష ఏప్రిల్ 2కు వాయిదా

పదో తరగతి పరీక్షలులో భాగంగా శనివారం 21వ తేదీన జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడినట్లు ఉదయగిరి ప్రాంత పరీక్షల నిర్వహకులు తోట శ్రీనివాసులు ఒక ప్రకటన తెలిపారు. 21వ తేదీన ఈద్ – ఉల్ – ఫితర్ (రంజాన్ ) పర్వదినం రావడంతో ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


