News March 6, 2026

జగిత్యాలలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు..!

image

జగిత్యాల జిల్లాలో అండర్ 14, 16, 17 వయస్సు గల బాలబాలికలకు జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి తెలిపారు. ఇండియా క్రీడా కార్యక్రమంలో భాగంగా మార్చి 12న జగిత్యాలలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. షాట్‌పుట్, లాంగ్ జంప్, 100 మీటర్ల పరుగు పందెం విభాగాల్లో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు తమ వివరాలను మార్చి 7 నుంచి NSRS పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు.

Similar News

News April 15, 2026

గుర్తుపెట్టుకోండి.. ‘అతి వినయం ధూర్త లక్షణం’

image

సహజ విరుద్ధంగా ఎవరి పట్లయినా అధిక వినయం, గౌరవాన్ని ప్రదర్శించేవారిని ప్రస్తావించేటప్పుడు ఈ సూక్తిని వాడతాం. పంచతంత్ర కథలు, చాణక్య నీతి కథల నుంచి ఇది వచ్చింది. వినయంగా ఉండటం మంచిదే. కానీ దాన్ని అతిగా ప్రదర్శిస్తున్నారంటే నమ్మక ద్రోహానికి సంకేతం కావొచ్చు. తమ పనులు సాధించుకోవడానికి మోసగాళ్లు, స్వార్థపరులు ఇలా చేస్తారు. మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎదురయ్యారా? కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>

News April 15, 2026

అబార్షన్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వనపర్తి జిల్లాలో అబార్షన్ కేసుల విషయంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కేసు వెనుక ఉన్న కారణాలు, చోటుచేసుకునే ప్రాంతాలపై సమగ్ర పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం గోపాలపేట మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈడీడీ డెలివరీ రిజిస్టర్లను పరిశీలించారు.

News April 15, 2026

పీజీఆర్ఎస్ అర్జీలకు వేగవంత పరిష్కారం: కలెక్టర్

image

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలను వేగంగా, నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఏ.సిరి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతీ రోజు లాగిన్‌లో అర్జీలను పరిశీలించి, వెంటనే స్పందించాలని సూచించారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించి సానుకూల స్పందన శాతాన్ని పెంచాలని తెలిపారు. జిల్లాలో 104 శాతం ఆదాయం సాధించడంపై ప్రశంసించారు.