News March 6, 2026

నిజామాబాద్: కోటి మంది మహిళా వ్యాపారవేత్తలే లక్ష్యం: మంత్రి సీతక్క

image

మహిళలు ఆత్మవిశ్వాసంతో సవాళ్లను ఎదుర్కోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవ నినాదం ‘గివ్ టు గైన్’ (Give to Gain) స్ఫూర్తితో మహిళలకు బాసటగా నిలవాలన్నారు. నక్సలైట్ నుంచి మంత్రి వరకు తన ప్రయాణానికి విద్యే మూలమని వివరించారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చడమే లక్ష్యమని పేర్కొన్నారు.

Similar News

News March 11, 2026

లక్షెట్టిపేట: వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి

image

లక్షెట్టిపేటలోని కొత్త ఫ్లాట్లకు చెందిన లకావత్ గణేష్(45) వడదెబ్బతో మృతి చెందాడని ఏఎస్ఐ అన్వర్ హుస్సేన్ తెలిపారు. వడదెబ్బ తగిలిందని గణేష్ మంగళవారం కొడుకు రాజేశ్వర్‌ను రూ.20 అడిగి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. బుధవారం ఇటిక్యాల చెరువు వద్ద గణేష్ శవం ఉందని స్థానికులు చెప్పడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. గణేష్ చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లి వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు ఏఎస్ఐ వెల్లడించారు.

News March 11, 2026

సిద్దిపేట: మధ్యాహ్న భోజనంపై కలెక్టర్ అసహనం

image

కోహెడ మండలం శనిగరంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ కె. హైమావతి బుధవారం సందర్శించారు. మధ్యాహ్న భోజనంలో పప్పు పలుచగా ఉండటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం తంగళ్లపల్లి కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని సందర్శించి, విద్యార్థుల భోజనం, వసతి, చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.

News March 11, 2026

KNR: ‘డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి’

image

డ్రగ్స్, గంజాయి, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి అలవాట్లు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, అడిషనల్ డీసీపీ వేంకటరమణ తెలిపారు. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువతలో అవగాహన కల్పించేందుకు విడుదల చేసిన కరపత్రాన్ని వారు KNRలో ఆవిష్కరించారు. మత్తు పదార్థాలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ తదితరులు ఉన్నారు.