News May 4, 2024

ప్రజ్వల్, రేవణ్ణ వికృత చేష్టలు.. మహిళను కట్టేసి అత్యాచారం

image

ఎన్నికల వేళ JDS MP ప్రజ్వల్ లైంగిక వేధింపుల అంశం కర్ణాటకను కుదిపేస్తోంది. ప్రజ్వల్, ఆయన తండ్రి రేవణ్ణ ఆగడాలకు బలైన వారిలో పని మనుషులు, విద్యార్థినులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, మహిళా అధికారులు సైతం ఉండటం గమనార్హం. వారి అకృత్యాలపై ఇప్పుడు బాధితులు బయటకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తన తల్లిని ప్రజ్వల్ కట్టేసి అత్యాచారం చేసినట్లు వీడియోలో ఉందని ఓ బాధితురాలి కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Similar News

News December 28, 2024

రూ.6,000 కోట్ల పోంజీ స్కామ్.. నిందితుడు అరెస్ట్

image

రూ.6వేల కోట్ల పోంజీ స్కామ్ ప్రధాన నిందితుడు భూపేంద్రసింగ్‌ను సీఐడీ అరెస్టు చేసింది. గుజరాత్‌ మెహసానా జిల్లాలోని ఓ గ్రామంలో దాక్కున్న అతడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకుంది. బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో అయిన ఇతను బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి వేలాది మందిని మోసం చేశారు. కొన్ని నెలలుగా అతను సీఐడీకి దొరక్కుండా తిరుగుతున్నారు.

News December 28, 2024

శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలంటే?

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 66,715 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,503 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో రూ.4.06 కోట్ల హుండీ ఆదాయం చేకూరింది.

News December 28, 2024

ఏపీలో కొత్త మద్యం విధానం.. తెలంగాణ రాబడిపై ఎఫెక్ట్!

image

ఏపీలో కొత్త మద్యం విధానం తెలంగాణ రాబడిపై ప్రభావం చూపుతోంది. లిక్కర్ ధరలు తగ్గడంతో ఆ రాష్ట్రంతో సరిహద్దు ఉన్న జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి. గతంతో పోలిస్తే ఒక్క డిసెంబర్‌లోనే రూ.40 కోట్ల రాబడి తగ్గినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్, సూర్యాపేట, KMM, కొత్తగూడెం, NLG, గద్వాల్ సరిహద్దుల్లో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల ఆదాయం తగ్గే అవకాశం ఉన్నట్లు గణాంకాలు పేర్కొన్నాయి.