News March 7, 2026

నల్లమలలో డ్రోన్ నిఘా!

image

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ డ్రోన్లను రంగంలోకి దించింది. వేటగాళ్ల కదలికలు, అడవి ఆక్రమణలు, కార్చిచ్చును పసిగట్టేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇవి 4 కి.మీ. దూరం వరకు నిఘా ఉంచుతాయని రేంజ్ ఆఫీసర్ వీరేశ్ తెలిపారు. అడవి జంతువులకు ఇక మరింత భద్రత లభించనుంది.

Similar News

News March 8, 2026

నాయుడుపేట: హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

image

పెళ్లకూరు వద్ద నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిపై అదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూల్‌డ్రింక్స్ లారీని బైక్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో బోడెద్దుల భరత్ (20) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ముని కుమార్‌ను 108 అంబులెన్స్‌లో శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెళ్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 8, 2026

నల్గొండ: అక్షరాస్యతలో వెనుకబడిన మహిళలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లా జనాభాలో మహిళలు పురుషులతో సమానంగా ఉన్నప్పటికీ, చదువులో మాత్రం వెనుకబడి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో వారి అక్షరాస్యత రేటు 49.59 శాతంగా నమోదైంది. వారి లిటరసీ పెంచేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ‘ఉల్లాస్’ వంటి కార్యక్రమాలు చేపడుతున్నా, క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు మరింత కృషి అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

News March 8, 2026

ఈ నెల 13న ఓటీటీలోకి ఫంకీ

image

విశ్వక్‌సేన్-అనుదీప్ కాంబోలో వచ్చిన ‘ఫంకీ’ OTT రిలీజ్ డేట్ ఫిక్సైంది. ఈ నెల 13వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ FEB 13న రిలీజై బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో పలువురు డైరెక్టర్లు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.