News March 7, 2026

కామారెడ్డి: పోలీస్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ

image

పోలీస్ సిబ్బందిని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. భిక్కనూర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నానని 100 నంబర్‌కు డయల్ చేశారు. తక్షణమే స్పందించిన కానిస్టేబుల్స్ వినయ్ కుమార్, రామాంజనేయులు ఘటనా స్థలానికి వెళ్లి అతని ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా వారిని ఎస్పీ అభినందిస్తూ నగదు ప్రోత్సాహం అందజేశారు.

Similar News

News April 5, 2026

పార్వతీపురంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

పార్వతీపురం కలెక్టరేట్‌లో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసే అవకాశం కల్పించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్’ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అర్జీలు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

News April 5, 2026

రేపు జరగబోయే పోలీస్ PGRS రద్దు: అనంతపురం ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన పోలీస్ PGRS కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా పోలీస్ PGRS కార్యక్రమానికి అర్జీదారులు ఎవరు రాకూడదని సూచించారు. పేరు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా బందోబస్తు, విధుల దృష్ట్యా PGRSను రద్దు చేశామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.

News April 5, 2026

నీటి సంరక్షణ.. రేపటి నుంచి 100 రోజుల యాక్షన్ ప్లాన్

image

AP: నీటి సంరక్షణ-జలవనరుల పరిరక్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు 100 రోజుల(ఏప్రిల్ 6-జులై 14) కార్యాచరణను ప్రకటించారు. రేపు అనంతపురం(D) యాడికిలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ‘చెరువులు, కాల్వలను క్లియర్ చేయాలి. నీటిని నిల్వ చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 8.7 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నాయి. వర్షాకాలం తర్వాత 3 మీటర్ల లోతున నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలి’ అని CM అధికారులకు దిశానిర్దేశం చేశారు.