News March 7, 2026

సివిల్స్‌లో పాలమూరు బిడ్డల సత్తా

image

యూపీఎస్సీ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఘనత చాటారు. మూసాపేట్ మండలం నిజాలపూర్‌కు చెందిన వెంకటేశ్ ప్రసాద్ 358వ ర్యాంకు సాధించగా, ప్రస్తుతం ఆయన నల్గొండలో డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణ పొందుతున్నారు. అలాగే ఖిల్లా ఘనపూర్ ఎంపీడీవో విజయసింహారెడ్డి 682వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. విధి నిర్వహణలో ఉంటూనే ఈ విజయం సాధించిన వీరిద్దరిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News April 9, 2026

కఠినాత్ముల మనస్సు కరిగించలేం!

image

వంపుకర్రగాచి వంపు తీర్చగవచ్చు
కొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపగా రాదు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: వంపుగా ఉన్న కర్రను వేడి చేసి తిన్నగా చేయవచ్చు. కొండలను కూడా పిండి చేయవచ్చు. కానీ మొండి పట్టుదల లేదా కఠినాత్ముల మనస్సును కరిగించడం సాధ్యం కాదు.
<<-se>>#PADHYAM<<>>

News April 9, 2026

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ బ్యూటీ?

image

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో యంగ్ హీరోయిన్ మానస వారణాసి స్టెప్పులు వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సాంగ్ కోసం మూవీ టీమ్ ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ బ్యూటీ ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. కాగా స్పెషల్ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

News April 9, 2026

చిత్తూరు: ఆరెంజ్ జోన్‌లో రెండు మండలాలు

image

బుధవారం అత్యధికంగా నగరిలో 42.1, గంగవరంలో 40.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రెండు మండలాలు ఆరెంజ్ జోన్‌లోకి వెళ్లాయి. పలమనేరులో 40.5, నిండ్రలో 39.7, శ్రీరంగరాజపురం, విజయపురంలో 39.8, వెదురుకుప్పం, పులిచెర్లలో 39.5, రొంపిచెర్లలో 39.3, చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్లో 39.1, గుడిపాలలో 38.9, పూతలపట్టులో 38.6, పాలసముద్రం, పెద్దపంజాణి, పెనుమూరు, యాదమరి(M)లో 38.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.